Janaki Kalaganaledu july 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి రామచంద్రను గదిలోకి తీసుకొని వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్రను జానకి లోపలికి పిలుచుకొని వెళ్లగా అప్పుడు రామచంద్ర చేయి వదలండి జానకి గారు నేనేమీ చిన్నపిల్లలను కాదు కదా అని అంటాడు. సరే అని జానకి పూలు తెచ్చారా అని అడగడంతో రామచంద్ర తేలేదు అని అంటాడు. అయినా స్కూల్ కి వెళ్లేటప్పుడు ఎవరైనా పూలు పెట్టుకొని వెళ్తారా అని రామచంద్ర అనగా వెంటనే జానకి ఈరోజు నేను అకాడమీ కి వెళ్ళను అని తెగేసి చెబుతుంది.
రామచంద్ర ఎందుకు అని అడగగా వెళ్ళను గాక వెళ్ళను ఎందుకంటే ఈరోజు అకాడమీకి హాలిడే అనడంతో రామచంద్ర మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత జానకి,జ్ఞానాంబ ఇచ్చిన పూలను తీసుకొని రామచంద్రులకు ఇచ్చి జడలో పెట్టమని చెబుతుంది. రామచంద్ర ఆ పూలు పెట్టడానికి టెన్షన్ పడుతూ ఉంటాడు. పూలు పెట్టిన తర్వాత వాసన చూడమని చెప్పి రామచంద్ర కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది.
Janaki Kalaganaledu july 18 Today Episode : జానకి, రామచంద్ర.. కుళ్లుకుంటున్న మల్లిక..?
ఆ తర్వాత ఉలిక్కిపడిన రామచంద్ర స్నానం చేసి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ పడుకున్నాక జానకి రామచంద్రవైపు చూస్తూ అలాగే ఉంటుంది. రామచంద్ర కూడా ఏం జరుగుతుందా అని మెలకువతోనే ఉంటాడు. అప్పుడు జానకి వైపు తిరిగి చూడగా పడుకున్నట్లు యాక్ట్ చేస్తుంది. అప్పుడు జానకి చూసి ఆనందంతో ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళగా మళ్లీ వద్దు అని అనుకుంటాడు.
ఆ తర్వాత జానకి మేలుకువ వచ్చి రామచంద్రను తనతో మాట్లాడమని చెప్పినా కూడా రామచంద్ర వినిపించుకోకుండా అటువైపు తిరిగి పడుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం వెన్నెల, అఖిల్ ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉండగా ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి ఎలా అయినా జానకిని ఇరికించాలి అని అనుకుంటుంది.
అప్పుడు మల్లిక ఇదిగో వెన్నెల అఖిల్ నైట్ కాలేజ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అని అనడంతో వారిద్దరూ మా ఇద్దరికి సంబంధించింది కాదు అని అనగా ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ దంపతులు వస్తారు. అప్పుడు మల్లికా జానకి పై లేనిపోని మాటలు చెబుతూ ఉండగా అప్పుడు జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. గోవిందరాజులు కూడా ఎందుకమ్మా పొద్దు పొద్దున్నే పెట్రోల్ పోసి కార్యక్రమం మొదలు పెట్టావు అంటూ మల్లికా పై మండిపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి విష్ణు కూడా వచ్చి మల్లికను తిట్టి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత అక్కడికి జానకి రామచంద్ర వస్తుండడం గమనించిన జ్ఞానాంబ వాళ్ల ముందు ఏమైనా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని మల్లికకు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు రామచంద్ర జానకి టిఫిన్ చేస్తూ ఉండగా రామచంద్ర తో సరసాలు ఆడుతూ ఉంటుంది జానకి. కానీ రామచంద్ర ఆ విషయం బయటకు చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఉన్నపలంగా జానకి నడుము గిల్లడంతో గట్టిగా అరుస్తాడు రామచంద్ర.
అప్పుడు జ్ఞానాంబ ఏమైంది నాన్న జ్వరం వచ్చిందా అని అనగా ఏమీ లేదు అమ్మ అని కవర్ చేసుకుంటాడు. వారిద్దరిని గమనించిన మల్లిక వారు చెప్పే డైలాగులకు వారి ప్రవర్తనకు అసలు సరిపోవడం లేదు ఏం జరుగుతుందా అని అనుకుంటూ ఉంటుంది. అలా వారిద్దరిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది మల్లిక.
Read Also : Janaki Kalaganaledu: రామచంద్రను రెచ్చగొడుతున్న జానకి..జ్ఞానాంబ ముందు అడ్డంగా బుక్ అయిన మల్లిక..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World