Janaki Kalaganaledu: రామచంద్రను రెచ్చగొడుతున్న జానకి..జ్ఞానాంబ ముందు అడ్డంగా బుక్ అయిన మల్లిక..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ జానకి గురించి గోవిందరాజులతో గొప్పగా చెబుతూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో జానకి,జ్ఞానాంబ అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జానకి రామచంద్ర తో కలిసి కార్యం ఏర్పాటు చేసిన రోజు రాత్రి జరిగిన విషయాల గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జానకి,జ్ఞానాంబ కు ఇచ్చిన ఒక మాట గురించి మాట్లాడుతూ ఉండగా రామచంద్ర మాత్రం జానకి ఐఏఎస్ కల గురించే మాట్లాడుతూ ఉంటాడు.

Advertisement

Advertisement

అప్పుడు జానకి ఎంత చెప్పినా కూడా రామచంద్ర వినిపించుకోకుండా జానకిని దూరం పెడతాడు. ఆ విషయాలన్నీ తలుచుకొని జానకి తనలో తానే మాట్లాడుకునే కుమిలిపోతూ ఉంటుంది. మరొకవైపు రామచంద్ర స్వీట్ షాప్ లో రాత్రి జరిగిన విషయం తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే జానకి ఫోన్ చేయడంతో చెప్పండి జానకి గారు అని అనడంతో వెంటనే జానకి ఏం చేస్తున్నారు శ్రీవారు అని తమాషాగా అడుగుతుంది.

Advertisement

అప్పుడు రామచంద్ర ఆలోచిస్తున్నాను అని అనడంతో వెంటనే జానకి రాత్రి జరిగిన విషయాల గురించేనా అని అంటుంది. వెంటనే రామచంద్ర రాత్రి ఏం జరగలేదు అని నేను ఏ కోర్టుకి వచ్చి చెప్పమన్నా చెబుతాను అని అనడంతో వెంటనే జానకి ఏ మనిషి వయ్యా నువ్వు చేసిందంతా చేసి ఇలా మాట్లాడుతున్నావు అంటూ కాస్త భాష చేంజ్ చేసి మాట్లాడడంతో వెంటనే రామచంద్ర ఏంటండీ అలా మాట్లాడుతున్నారు అని అడగగా వెంటనే జానకి తనదైన స్టైల్ లో సమాధానం ఇస్తుంది.

Advertisement

ఆ తర్వాత జానకి ఇంటికి వచ్చేటప్పుడు పూలు తీసుకొని రండి అని అనగా రామచంద్ర ఏమీ తెలియనట్టుగా వెటకారంగా అడగడంతో జానకి రామచంద్రకు తగిన విధంగా బుద్ధి చెబుతుంది. ఆ తర్వాత రామచంద్ర కోసం జానకి ఎదురు చూస్తూ ఉంటుంది. మరొకవైపు మల్లికా ఎక్కిళ్ళు వచ్చాయి అని పనిమనిషిని నీళ్లు తీసుకుని రమ్మని పిలవగా ఆమె ఎంతసేపటికి రాకపోవడంతో బయటకు నీళ్లు తాగడానికి వస్తుంది.

Advertisement

అక్కడ మల్లికను చూసి ఏంటి హీరోయిన్ గారు ఫుల్ గా ముస్తాబయ్యారు అని కుళ్లుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామచంద్ర రావడంతో జానకి సంతోషంగా రామచంద్ర కు ఎదురు వెళ్తుంది. అప్పుడు రామచంద్ర జానకి ఇద్దరు బయటి ఒకరి వైపు చూసుకుంటూ రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉండగా అది చూసిన మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్రను జానకిని ఇంట్లోకి పిలుచుకొని వెళుతుంది.

Advertisement

ఆ తర్వాత విష్ణు అక్కడికి వచ్చి మల్లికా తో రొమాంటిక్గా మాట్లాడగా మల్లిక మాత్రం కసురుకొని అక్కడినుంచి విష్ణుని పంపిస్తుంది. ఆ తర్వాత జానకి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి వెళ్లి తొంగి తొంగి చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జ్ఞానాంబ రావడంతో ఒక్కసారిగా బుక్ అవుతుంది మల్లిక. అప్పుడు మల్లికకు జ్ఞానాంబ కీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తుంది.

Advertisement
Advertisement