Devatha june 23 today episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవి ఎంట్రీ ఇవ్వడంతో ఆదిత్య, రాధా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి మాధవ గిఫ్ట్ ఇవ్వగా మాధవ కూడా దేవి పేరును పచ్చబొట్టు పొడిపించుకున్న చేతిని చూపించి నువ్వంటే నాకు ఉన్న ప్రేమ ఇదే అని అనడంతో రాద షాక్ అవుతుంది. అప్పుడు ఆదిత్య అదంతా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మాధవ స్టేజ్ పై నిలబడి మాట్లాడుతూ దేవి తనను ఇంతగా ఇష్టపడటానికి కారణం రాధ అని చెప్పడంతో రాధ, ఆదిత్య షాక్ అవుతారు.

Devatha june 23 today episode
ఆ తర్వాత స్టేజి మీదికి తన ఫ్యామిలీ ని పిలిచి ఇదే నా కుటుంబం పిల్లలే నా బలం అని అనడంతో ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన ఆదిత్య ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండగా ఇంతలో సత్య అక్కడికి వచ్చి ఆంటీ ఆరోగ్యం ఏమీ బాగోలేదు ఈ వయసులో ఉపవాస దీక్ష చేపట్టింది వద్దు అని ఎంత చెప్పినా వినడం లేదు అని అంటుంది.
దేవుడమ్మ మాత్రం తన కోడలు ఇంటికి వచ్చే వరకు ఉపవాస దీక్షను ఆపేది లేదు అని పట్టు బట్టుకొని కూర్చుంది. మరొక వైపు రాధా స్కూల్లో జరిగిన విషయాన్ని తలచుకుని కోపంతో రగిలి పోతూ ఉండగా అక్కడికి వచ్చి రాధా ను మరింత రెచ్చగొట్టాడు. అప్పుడు మాధవ మాట్లాడుతూ ఒక రోజు నేను ఇంట్లో లేకపోతే దేవి అలా అయిపోయింది.
ఈ పచ్చబొట్టుతో దేవి మనసు ఇంకా గెలుచుకున్నాను నా నుండి దేవిని దూరం చేయడం నీ వల్ల ఆదిత్య వల్ల కాదు అని అనగానే వెంటనే రాధ నవ్వుతూ మాట్లాడుతుంది. వెటకారంగా నవ్వుతూ బాగా దిగజారి పోయావని మిమ్మల్ని చూస్తే కోపం కంటే బాధనే ఎక్కువగా అనిపిస్తుంది అని అంటుంది.
దేవుని కూడా తనకు దూరం చేస్తే ఊరుకునేది లేదని ఆదిత్య కూడా ఆ విషయంలో ఊరుకోడు అంటూ మాధవ కు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది రాధ. ఆదిత్య కూడా స్కూల్లో జరిగిన విషయం గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆదిత్య రాధను కలిసి దేవి విషయం గురించి బాధపడుతూ ఉంటాడు.
ఇక నావల్ల కాదు మన ఇంటికి వెళ్దాం పద రాదా అని అనగా, అప్పుడు రాధ పిల్లలకు ఏం సమాధానం చెప్పాలి అని బాధ పడుతూ ఉండగా ఆదిత్య తనతో మాట్లాడటం కోసం రాధకు ఒక ఫోన్ ఇచ్చి ఎలా ఫోన్ చేయాలో నేర్పిస్తాడు. ఆ తర్వాత జానకి పై రాధ మండిపడుతోంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని గట్టిగా చెప్పడంతో జానకి షాక్ అవుతుంది.
Read Also : Devatha june 22 today episode : సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవ.. షాక్ లో ఆదిత్య, రాధ..?