Prabhas : టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబంలో మాత్రమే కాకుండా యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక నాన్న లేని ప్రభాస్ తన పెదనానని సొంత తండ్రిగా భావించేవాడు.
Prabhas : నెలరోజుల పాటు సినిమా షూటింగ్లకు దూరంగా ప్రభాస్
అయితే కృష్ణంరాజు ఇలా అనారోగ్య సమస్యలతో మృతి చెందడం వల్ల ప్రభాస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కృష్ణంరాజుకు కొడుకులు లేకపోవటంతో ప్రభాస్ దగ్గరుండి కృష్ణంరాజు వారసుడిగా తన పెదనాన్న మరణించిన తర్వాత జరగాల్సిన అన్ని కార్యక్రమాలను జరిపించాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు మరణం నుండి ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. అందువల్ల ప్రభాస్ తన సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కె సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కృష్ణంరాజు మృతి చెందడం వల్ల ఆ సినిమా షూటింగ్లకు బ్రేక్ పడింది. అయితే కృష్ణంరాజు వారసుడిగా ఆయన మరణానంతరం అన్ని దగ్గరుండి చూసుకున్న ప్రభాస్ తన కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ నెలరోజుల పాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటూ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోనున్నట్లు సమాచారం. దీంతో సలార్ ప్రాజెక్ట్ కె సినిమా షూటింగులు విడుదల అవ్వటానికి మరి కొంత కాలం పట్టేలా ఉంది.
Read Also : Big boss Himaja: హిమజ్ బెంజ్ కారు ధ్వంసం, సీసీటీవీ ఫుటేజీతో యువకుడికి చుక్కలు చపిస్తోందిగా!