Woman Successful story: కేరళలో ఒకప్పుడు నిమ్మరసం అమ్ముకుంటూ జీవనం సాగించిన ఓ అమ్మాయి ఎస్సై అయి అందిరకీ ఆదర్శంగా నిలిచింది. తిరువనంతపురం జిల్లాలోని కుంజిరాంకుళంకు ెచందిన ఎస్పీ ఆనీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేస్కునేందుకు కుటుంబ సభ్యులను ఎదురించింది. ఇలా తల్లిదండ్రులను ఎదురించి ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన ఆమెకు రెండేళ్లకే కుమారుడు జన్మించాడు. అయితే తనకు కకుమారుడు పుట్టగానే భర్త వదిలి వెళ్లిపోయాడు. వద్దని వెళ్లిపోయిందనే కోపంతో తల్లిదండ్రులు కూడా చేరతీయలేదు. ఇలా కట్టుకున్న వాడు కాదనడంతో ఒంటరిగానే మిగిలిపోయింది.
దీంతో కొన్నాళ్లపాటు వాళ్ల అమ్మమ్మ దగ్గర ఉంది. ఆ తర్వాత ఈమెకు అద్దె ఇల్లు కూడా దొరకలేదు. దీంతో నిమ్మరసం, ఐస్ క్రీంలు అమ్ముతూ డబ్బులు సంపాదించింది. ఇలా పనులు చేస్కుంటూనే పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. 2016లో పోలీసు నోటిఫికేషన్ పడగా తన బంధువుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఈమె పరీక్షకు దరఖాస్తు చేస్కుంది. ఈ తర్వాత అందులో విజయం సాధించి ఎస్ఐ ఉద్యోగం సంపాదించింది. ఎక్కడ నిమ్మరసం అమ్ముతూ జీవనం సాగించిందో అక్కడే ఎస్ఐగా విధులు నిర్వర్తించింది. ఈమె సాధించిన ఘనత చూసి ప్రతీ ఒక్కరూ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.