Big boss Himaja: బిగ్ బాస్ ఫేమ్ హిమజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన లగ్జరీ బెంజ్ కారు లోగోని విరిచేశాడంటూ నెట్టింట్లో వీడియోను షేర్ చేసింది హిమజ. తన అపార్ట్ మెంట్ లో కార్లు క్లీన్ చేసే అబ్బాయే తన కారుని ధ్వంసం చేశాడని, దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్ తో పంచాయతీ పెట్టింది హిమజ. కార్లు క్లీన్ చేసే వాళ్లు కార్లను క్లీన్ చేస్తుండగా… నా బెంజ్ కార్ లోగో అట్రాక్ట్ చేసినట్లు ఉంది. మరి సరదా కోసమో దూల కోసమో తెలియదు కానీ లగోని విరిచేశాడంటూ ఫైర్ అయింది. అది మహా అితే పది వేలు ఉంటుందేమో కానీ వాడలా ఉత్తిగా చేయడం నాకు నచ్చలేదంటూ వీడియో చేసింది.
అయితే ఎవరైతే తన కారుని ధ్వంసం చేశారని హిమజ ఆరోపిస్తుందో… అతడు మరుసటి రోజు కూడా కార్లను క్లీన్ చేయడానికి వచ్చాడు. దీంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది హిమజ. అయితే నేను విరగ్గొట్టలేదని ప్రూఫ్ చూపించమంటూ అడిగాడు. అయితే ప్రతిరోజూ ఆ అబ్బాయి కారు దగ్గర తచ్చాడుతూ కనిపించడం వాస్తవమే కానీ కారు లోగో విరగ్గొట్టినట్లు మాత్రం ఆ వీడియోలో లేదు.