Double Elimination: బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం నుంచి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి పంపారు. తొలి రోజు నుంచో గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలతో రంజుగా సాగుతోంది. తొలివారంలో నో ఎలిమినేషన్స్ అంటూ చేతులెత్తేశారు. ఓట్లు గుద్దించుకుని ఎలిమినేషన్ ఎత్తేయడంపై విమర్శలు రాగా.. రెండో వారంలో అంతకు మించిన ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఈసారి అంటే తొలి వారంలో ఇనయ సుల్తానా, అభినయ శ్రీ, ఫైమా, శ్రీ సత్య, ఆరోహి, చలాకీ చంటి, సింగర్ రేవంత్ లు నామినేషన్లలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అతొలి వారమే అభినయ శ్రీ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఎలిమినేషన్ ఎత్తేయడంతో ఆమె సేవ్ అయిపోయింది.
రెండో వారంలో ఆది రెడ్డి, రోహిత్-మెరీనా, షానీ సాల్మన్, రాజ్, రేవంత్, అభినయ శ్రీ, ఫైమా, గలాటా గీతు.. ఈ ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే పోయిన వారం ఎలిమినేషన్ లేకపోవడడంతో.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా.. ఒకేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం షానీ సాల్మన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తోంది. ఫుటేజీలో వీళ్లు ఎక్కువగా కనిపించకపోవడమే ఇందుకు కారణం అని కూడా అంతా భావిస్తున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.