Pooja Hegde : టాప్ హీరోయిన్ పూజా హెగ్డే.. వరుస సినిమాలతో బిజీగా అయిపోయింది. చేతినిండా సినిమాలతో వరుస విజయాలతో కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. నాజుకు అందంతో కుర్రకారును కట్టిపడేసేలా పూజా హెగ్డే బేబీ పింక్ డ్రెస్సులో మెరిసిపోతోంది. పూజా నటించిన పలు తెలుగు సినిమాల్లో అలవైకుంఠపురంలో సక్సెస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ ఆపై రాధే శ్యామ్ వంటి పలు సినిమాల్లో నటించి తనదైన గుర్తింపును తెచ్చుకుంది.
ప్రస్తుత రోజుల్లో ఎవరైనా సినీ పరిశ్రమలో రాణించాలంటే అందంతో పాటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యమనేది తెలిసిందే.. అందుకే ఫిట్ గా ఉండేందుకు బలమైన ఆహారంతో పాటు జిమ్ లో గంటలకొద్ది వర్కౌట్లు చేస్తుంటారు. లేదంటే బొద్దుగా మారితే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. హీరోలు, ప్రొడ్యుసర్లు ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రారు. అందుకే ఎప్పుడూ అందంగా ఫిట్ గా ఉండేందుకు హీరోయిన్లు ఇలా వర్కౌట్లతో తెగ కష్టపడుతుంటారు.

లేటెస్టుగా పూజా హెగ్డే కూడా తన ఫిట్ నెస్ కాపాడుకునేందుకు జిమ్ లో వర్కౌట్లు చేస్తోంది. జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత బయటకు వస్తున్న పూజాహెగ్డే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జిగేల్ రాణి.. లేత పింక్ రంగు ఫిట్ డ్రెస్ ధరించి బయటకు వచ్చింది. ఒళ్లంతా కనిపించేలా ఒళ్లు సొంపులు వయ్యారాలు వలకబోస్తోంది బుట్టబొమ్మ..
తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన వారితో ఫొటలకు పొజులిస్తోంది. ఒక లైలా కోసం మూవీతో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైంది. 2012లో ముగమూడి అనే మూవీలో తెరంగేట్రం చేసింది ఈ భామ. F3 మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ కూడా పూజా హెగ్డే చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్ నడుస్తోంది. వైరల్ అవుతున్న పూజా హెగ్డే వీడియో ఇదే..