Viral news : ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం కోసం చాలా మంది చాలా త్యాగాలు చేస్తుంటారు. కోరుకున్న ప్రేమనుు దక్కించుకునేందుకు ప్రాణాలు తీస్కునేందుకైనా, ఇచ్చేందుకైనా వెనుకాడరు. అయితే తాజాగా ఓ అమ్మాయి తన ప్రేమను గలిపించుకునేందుకు ఎవరూ చేయలేని సాహసం చేసింది. అయితే ఆమె ఏం చేసిందో తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి తన ప్రేమను గెలిపించుకునేందుకు లింగ మార్పిడి చికిత్స చేయించుకుంది.
ఎందుకంటే ఆమె మరో అమ్మాయిని ప్రేమించింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ నగరానికి చెందిన ఈ ఇద్దరు యువతులు.. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏది ఏమైనా కలిసే జీవితం గడుపుదామని ప్రమాణం చేస్కున్నారు. అయితే వీరి సంబంధాన్ని ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకోవడంతో.. ఓ అమ్మాయి లింగ మార్పిడి చికిత్స చేయుంచుకుంది.
అయితే భవిష్యత్తులో తమ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి ఈ చికిత్స చేస్కుందని.. పట్టణంలోని రాణి నెహ్రూ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అయితే యువతి శీరరం భాగాల్లోని పలు ప్రైవేటు పార్టులు తొలగించి.. అబ్బాయిల మార్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని వివరించారు. అయితే చికిత్స చేయించుకున్న యువతి ఆరోగ్యంగా ఉందని డాక్టర్ మోహిత్ తెలిపారు.
Read Also : Viral video: పామును ఆడించబోయాడు.. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు!