Nuvvu Nenu Prema Serial Aug 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మురళి ఏదో ఒక సాకు చెప్పి ఫంక్షన్ నుండి తప్పించుకుంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.ఇక కుచల పద్మావతి మరియు అను ని చూసి ఇల్లంతా వాళ్లదే అయినట్టు తిరుగుతున్నారు. ఎలాగైనా వాళ్లకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. అను అందరికీ జ్యూస్ ఇస్తుంటే తనని పిలిచి అందరికీ ఇస్తున్నావు మరి నాకు ఇవ్వట్లేదు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు అను మీరు ఇందాక వద్దు అన్నారు కదా అందుకే ఇవ్వట్లేదు అంటుంది.
Shanthadevi lashes out at Kuchala for humiliating Anu
ఇక కుచల జ్యూస్ తీసుకుని కావాలనే గ్లాస్ కింద పడేస్తుంది. ఇక దాన్ని క్లీన్ చేయమని చెప్తుంది. అప్పుడు ఆర్య అక్కడికి వచ్చి తను ఎందుకు క్లీన్ చేయాలి అమ్మ పని వాళ్లకు చెప్తాను అంటాడు. అప్పుడు కుచల ఈ డర్టీ గర్ల్ మీద నువ్వు ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నావ్ ఏం పర్లేదు తనే క్లీన్ చేస్తుంది అంటుంది. ఇక అను ఫ్లోర్ క్లీన్ చేస్తుంటే పద్మావతి అక్కడికి వచ్చే అక్క నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటుంది. ఇక విక్కీ వాళ్ళ నానమ్మ కూడా కుచల మీద అరుస్తుంది. ఇక మాయ వంటల దగ్గరికి వెళ్లి పద్మావతి మీద కోపంతో ఎలాగైనా వాటిని పాడు చేయాలి అనుకుంటుంది. ఇక కుచల అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు మాయ ఏం లేదండి ఊరికనే ఉన్నాను అంటుంది.
Shanthadevi lashes out at Kuchala for humiliating Anu
పర్లేదు చెప్పు అనగానే మాయ ఎలాగైనా పద్మావతి మీద పగ తీర్చుకోవాలి అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియడం లేదు అంటుంది. అప్పుడు కుచల నాకు చెప్పు నేను చేస్తాను అంటుంది. ఇక మాయ వంటలు పాడు చేస్తే విక్కీ వాళ్ళ మీద అరుస్తాడు అంటుంది. అప్పుడు కుచల వంటలలో ఉప్పు, కారం చల్లుతుంది. ప్రేమ్ సింగ్ అక్కడికి వచ్చి మీరిద్దరూ ఏంటి ఇక్కడ ఉన్నారు అంటాడు. . అప్పుడు కుచల ఇక్కడ ఎవరూ లేరు ఏంటి వీటిలో ఏమైనా పడి ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటుంది. అప్పుడు ప్రేమ్ సింగ్ క్షమించండి మేడం నేను ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాను ఇప్పుడే ఐస్క్రీమ్ తీసుకొద్దామని బయటకి వెళ్ళాను అంటాడు. ఇక ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అంటాడు.
Nuvvu Nenu Prema Serial Aug 19 Today Episode : అనుపై విరుచుకుపడిన కుంచల.. అడ్డుకున్న శాంతాదేవి..
ఇక అరవింద మరియు వాళ్ళ నానమ్మ భోజనాలు సిద్ధమయ్యాయ వచ్చిన వాళ్లకి వడ్డించండి అంటారు. కుచల అక్కడికి వచ్చి ముందు మీరు చేసిన వంట టేస్ట్ చేయాలి కదా అంటుంది. అప్పుడు అరవింద పద్మావతి చేసిన వంటకి వంక పెట్టడం అవసరం లేదు తను చాలా టేస్టీగా చేస్తుంది అంటుంది. ఇక వాళ్ళ నానమ్మ కూడా అలానే అంటుంది. అప్పుడు కుచల అయినా ఒకసారి టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పి వంటలను టేస్ట్ చేస్తుంది. అసలు వీటిని ఎవరైనా వంటలు అంటారా వీటిలో ఉప్పు కారం ఎక్కువ అయ్యాయి అంటుంది. వీటిని ముందుగా గెస్ట్ లు తింటే మా మొహం మీద ఉమ్ముతారు అంటుంది.
Shanthadevi lashes out at Kuchala for humiliating Anu
కుచల నేను ఏమి కావాలని చెప్పట్లేదు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అంటుంది. అప్పుడు అరవింద మరియు వాళ్ళ నానమ్మ టేస్ట్ చేస్తారు. ఇక వాళ్లకు కూడా అలానే అనిపిస్తుంది. అప్పుడు పద్మావతి ఏదో పొరపాటు జరిగింది మేము ఇంటి నుండి తెచ్చినప్పుడు చాలా బాగానే ఉన్నాయి అంటుంది. అప్పుడు కుచల అంటే ఎవరు లేని సమయంలో నేనే ఉప్పు కారం వేశాన అంటుంది. ఇప్పుడు వచ్చిన గెస్ట్ లకు ఏం పెట్టాలి. ది గ్రేట్ విక్రమాదిత్య కనీసం భోజనం కూడా పెట్టలేదు అని అందరూ అనుకుంటారు అంటుంది.
అత్తయ్య వీళ్ళని ఇక్కడ నుండి పంపించండి మనం ఫైవ్ స్టార్ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేద్దాం అంటుంది. ఏంటి ఇంకా ఇక్కడి నిల్చున్నారు బయటికి వెళ్ళండి అని సెక్యూరిటీని పిలుస్తుంది. అప్పుడు పద్మావతి మాకు నిజంగా ఏమీ తెలియదు మా పొరపాటును సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటుంది ప్లీజ్ మీకు దండం పెడతాను అంటూ కుచల నీ బ్రతిమలాడుతుంది. ఇక కుచల వెళతారా మెడపట్టి బయటకు పంపించాలా అంటుంది. ఇక రేపు ఏం జరగబోతుంది చూడాలి.
Read Also : Nuvvu Nenu Prema Serial : పద్మావతిని చూడగానే పరారైన మురళి.. ఎమోషనల్ అయిన అరవింద.. ఓదార్చిన పద్మావతి