Naga Chaitanya : నాగచైతన్య -సమంత దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.2017 లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ బంధం ఎంతో కాలం గడవకముందే విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకుని కూడా దాదాపు పది నెలలు కావస్తోంది. కానీ ఈ జంటపై వచ్చే రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. ఇక వీరి పేరు వినగానే సోషల్ మీడియా లో కామెంట్ ల వర్షం కురుస్తుంది. ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం అటు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ఈ జంట పెళ్లికి ముందే కాదు తర్వాత కూడా నటించారు.

ఈ జంటను చూసి అందరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రశంసలు గుప్పించారు. ఇక మోస్ట్ రొమాంటిక్ జంటగా గుర్తింపు పొందారు. కానీ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. పెళ్లితో ఒక్కటైన వీరి బంధం నాలుగేళ్లు గడవకముందే డివర్స్ తీసుకుంటున్నామని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయినప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక న్యూస్ హైలెట్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా నాగ చైతన్య థాంక్యూ అనే మూవీ తో మన ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా అందర్నీ మెప్పించలేకపోయింది. ప్రస్తుతం చైతు దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.
Naga Chaitanya : సమంతతో నటించే అవకాశంపై కూల్ రిప్లై ఇచ్చిన చైతు…
ఇక చైతూ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. లాల్ సింగ్ చడ్డ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇక నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి తెలుగు లో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అద్వైతచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అమీర్ ఖాన్ తో కలిసి చైతు అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు.. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ చైతన్య నీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడగడం జరిగింది.

మీరు సమంత కలిసి చేసిన సినిమాలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చాయి. ఇక మీదట కూడా నటించే అవకాశం వస్తే మీరు దానికి ఒప్పుకుంటారా అని అడుగుతాడు. చైతు దానికి సమాధానంగా ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఈ ప్రపంచానికి తెలియాలి అని చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తాడు. తను ఇచ్చిన ఆన్సర్ కి చైతు ఫ్యాన్స్ చైతు ని ప్రశంసలతో ఎత్తేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని వదినకున్నావు అంతా నీ కర్మ అంటూ సమంత పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Naga chaitanya : సామ్ తో మళ్లీ అలా చేయాలో లేదో ప్రజలే చెప్పాలి..!