...

Samantha : పుష్ప-2లో సమంత.. ఐటెం సాంగ్ కాదు.. ఆ పాత్రలో సామ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

Samantha : అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు సౌత్, అటు నార్త్ ఇండియాలో కుమ్మేసింది ఈ సినిమా. ఒక్కసారిగా బన్నీ ఇమేజ్ ఆకాశానికి పెరిగింది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పేరు వచ్చింది. హీరోయిన్ గా చేసిన రష్మిక మందన్న అయితే నేషనల్ క్రష్ గా మారిపోయింది. టాలీవుడ్ తో బాలీవుడ్ లోనూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది క్రష్మిక.

సమంత పుష్పలో ఐటెం సాంగ్ చేసింది. చేసింది ఒక్క సాంగే అయినా.. రెమ్యునరేషన్ మాత్రం హీరోయిన్ రష్మిక కంటే కూడా ఎక్కువగా తీసుకుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఊ అంటావా మావా.. సాంగ్ తో అల్లాడించింది సామ్. అయితే పుష్ప సినిమా భారీ హిట్ సాధించడంతో.. సాధారణంగానే పుష్ప-2 పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పుష్ప-2 ఓ రేంజ్ లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అంచనాలకు అందని రేంజ్ లో ఉండేలా కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడు సుకుమార్. అందుకే పుష్ప-2 షూటింగ్ ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు.

ఊహించిన దానికంటే పుష్ప బీభత్సమైన హిట్ కొట్టడంతో ఒక రకంగా సుకుమార్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడనే చెప్పాలి. అయితే ఇదే క్రమంలో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తీద్దామనుకుంటున్నాడు సుక్కు. సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది సామ్. ఆ క్రేజ్ ను పుష్ప-2 కోసం వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడట సుక్కు. అందుకోసం పుష్ప-2లో సమంతకు కీలక రోల్ ఇస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

Read Also : Samantha : హీరోయిన్‌గానే కాదు.. స్కూళ్లోనూ సమంత టాపరే.. సామ్ టెన్త్ క్లాస్ మెమో ఇదే..!