Telugu NewsEntertainmentNaga Chaitanya -Samantha: భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా.. షాకింగ్ సమాధానం చెప్పిన చైతన్య?

Naga Chaitanya -Samantha: భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా.. షాకింగ్ సమాధానం చెప్పిన చైతన్య?

Naga Chaitanya -Samantha: సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయి దాదాపు ఏడాది కావస్తున్న ఇప్పటికి వీరి గురించి ఏదో ఒక వార్త చర్చనీయాంశంగా మారుతుంది. సమంత నాగచైతన్య విడాకులతో విడిపోయి ఎవరి సినీ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు వీరి విడాకులకు సంబంధించి కారణం ఏంటి అనే విషయం మాత్రం వెల్లడించలేదు అయితే విడాకులు తర్వాత సమంత నాగచైతన్య గురించి పలు సార్లు ప్రస్తావించినప్పటికీ నాగచైతన్య మాత్రం ఎక్కడ సమంతను ఉద్దేశించి మాట్లాడలేదు. అయితే నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఈనెల 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన నాగచైతన్యకు యాంకర్ నుంచి తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే విడాకుల గల కారణాల గురించి ఈయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఎంతో అసహనం వేస్తుందని ప్రతి ఒక్కరికి వాళ్లకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా విడాకులు తీసుకున్న తర్వాత తన దారి తనది నా దారి నాది అంటూ చైతన్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఇకపోతే గతంలో నాగచైతన్య తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సమంతతో బాగా కుదురుతుందని చెప్పిన విషయం గురించి ప్రశ్నిస్తూ భవిష్యత్తులో సమంతతో నటించాల్సి వస్తే నటిస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ సమంతతో నటిస్తానా లేదా అనే విషయం నాకైతే తెలియదు, భవిష్యత్తులో మేమిద్దరం కలిసి నటిస్తే అది క్రేజీగా ఉంటుందేమో. మరి ఆ అవకాశం వస్తుందో లేదో విధికి మాత్రమే తెలిసి ఉంటుంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు