Bindu Madhavi: పిల్ల జమిందార్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బిందు మాధవి ఆ తర్వాత ఆవకాయ బిర్యాని వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు ఎక్కువ రావడంతో బిందు మాధవి చెన్నైలో సెటిల్ అయ్యింది. ఇటీవల ఓటిటిలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొనింది. ఈ షో ప్రారంభమైన నాటి నుండి బిందు మాధవి టైటిల్ కోసం చాలా కష్టపడింది. ఈ సీజన్లో పాల్గొన్న మేల్ కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇస్తు ఆడ పులిగా బాగా ఫేమస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో నటరాజ్ మాస్టర్ తో జరిగిన గొడవ వల్ల నాగార్జున కూడ బిందు మీద సీరియస్ అయ్యాడు.
మొదటినుండి టైటిల్ విన్నర్ రెస్ లో మొదటి రెండు స్థానాలలో ఉన్న బిందు ఎట్టకేలకు టైటిల్ దక్కించుకొని మొదటి లేడీ టైటిల్ విన్నర్ గా గుర్తింపు పొందింది. ఇలా బిగ్ బాస్ ద్వారా తెలుగులో మళ్ళీ పాపులర్ అయిన బిందు మాధవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందమైన తన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బిందు మాధవి ఇటీవల మోకాళ్ల వరకు ఉన్న స్లీవ్ లెస్ టాప్ ధరించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే బిందు మాధవి షేర్ చేసిన ఈ ఫోటోకు కొందరు నటిజెన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఒక లేడీ నేటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
బిందు మాధవి షేర్ చేసిన ఫోటోకి నేటిజన్ కామెంట్ చేస్తూ.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అందరూ స్కిన్ షో చేసినా కూడా మీరు చాలా పద్ధతిగా దుస్తులు ధరించారు. కానీ ఇప్పుడు ఇలాంటి దుస్తులు ధరించటంతో మీ మీద ఉన్న గౌరవం పోయింది. ఆ సమయంలో అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి అలాంటి దుస్తులు ధరించారని విమర్శిస్తూ ఒక లేడీ నేటిజన్ కామెంట్ చేసింది. అయితే ఈ కామెంట్ కి బిందు మాధవి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఒక వ్యక్తి ధరించే దుస్తులను బట్టి వారికి గౌరవం ఇస్తానంటే అటువంటి గౌరవం నాకు అవసరం లేదు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. దీంతో బిందు మాధవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.