Karthika Deepam: మోనిత ప్లాన్ తెలుసుకుని షాక్ అయిన హేమచంద్ర.. దీప నిలదీసిన సౌందర్య?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హేమచంద్ర కార్తిక్ ఎదురు దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో చెప్పండి డాక్టర్ బాబు పిలిచారు అనగా నీకు వీడి పడదని చెప్పాను కదా దీప ఎందుకు పదే పదే ఎక్కడికి వెళ్తావు అనడంతో పిల్లలు పిండి వంటలు అని అడిగారు అందుకే ఏం చేయలేకపోయాను డాక్టర్ బాబు అనగా నీ హెల్త్ కండిషన్ గురించి కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా దీప అంటాడు హేమచంద్ర. నాక్కూడా వేడి దగ్గరికి వెళ్లి నా ప్రాణాలు తొందరగా తీసుకోవాలని ఏమైనా సరదానా అన్నయ్య నాకు బతకాలని నిండు నూరేళ్లు జీవించాలని ఉంది. నేను బతికే అవకాశం లేదా డాక్టర్ బాబు అని దీప ఎమోషనల్ గా అడగడంతో కార్తీక్ మోనిత మాటలను తలుచుకుంటూ ఉంటాడు.

అప్పుడు దీప బాధను చూసి కార్తీక్ హేమచంద్ర కూడా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే పిల్లలు పిలవడంతో దీప అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సౌందర్య పిల్లలిద్దరూ కలిసి భోగిమంటకు అన్ని ఏర్పాట్లు చేసి దీప కార్తీక్ లను పిలుస్తారు. అప్పుడు కార్తీక్ దీపకి జాగ్రత్తలు చెబుతూ ఉండగా నా సంతోషానికి అడ్డుకట్ట వెయ్యొద్దు డాక్టర్ బాబు అక్కడికి వెళ్లి భోగి మంటను వెలిగిస్తారు. ఇంతలోనే మోనిత అక్కడికి వచ్చి ఆ భోగి మంటను ఆర్పీయడంతో అందరూ షాక్ అవుతారు.

ఇక్కడ నా కడుపు మంట పుడుతుంటే మీకు భోగి మంటలు కావాలా అనడంతో మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవా రాక్షసి అనడంతో ఉండనివ్వను ఆంటీ అని అంటుంది. అసలు కార్తీక్ పక్కన భార్యగా ఇవన్ని చేయాల్సిన దాన్ని నేను నీ పిల్లల స్థానంలో నా కొడుకు ఆనంద్ ఉండాలి అంటూ మోనిత నోటికి వచ్చిన విధంగా వాగడంతో దీప కోపంతో మోనిత జుట్టు పట్టుకొని ఇంకొక మాట మాట్లాడావంటే ఈ కాలే అగ్గిలో నిన్ను కూడా తగలబెట్టేస్తాను అని అంటుంది. నన్ను వదలండి డాక్టర్ బాబు ఈరోజు ఈ మోనితను చంపేస్తాను అనగా అప్పుడు మోనిత అసలు నిజం చెప్పాలి అనుకోవడంతో కార్తీక్ సీరియస్ అది ఇక్కడి నుంచి ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపో అనగా మోనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత పిల్లలు అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హేమచంద్ర కార్తీక్ ఇద్దరు మోనిత చేసిన పనిని తలుచుకుని ఒక విధంగా మంచి పనే చేసింది లేకపోతే ఈపాటికి దీపన హాస్పిటల్కి పిలుచుకొని పోయే వాళ్ళం అనడంతో అవును హేమచంద్ర ఎప్పుడు ఏం జరుగుతుందా అని భయంగా ఉంది అంటాడు కార్తీక్. అప్పుడు మోనిత కార్తీక్ నీ పిలవడంతో కార్తీక్ అక్కడికి వెళ్తాడు. ఏంటి కార్తీక్ కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు అనడంతో నీకు నేను ఎందుకు థాంక్స్ చెప్పాలి అని అంటాడు కార్తీక్. అప్పుడు మోనిత మళ్లీ గుండె మార్పిడి గురించి మాట్లాడుతూ ఈ క్షణం ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తాను.

దీపకు గుండె మార్పిడి చేసుకో కార్తీక్ నా గుండె చప్పుడు జీవితాంతం నీకు వినిపిస్తూనే ఉంటుంది అని కార్తీక్ నీ తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మోనిత. మరొకవైపు సౌందర్య దీప జరిగిన విషయాలు తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ మోనిత మిమ్మల్ని శనిల దాపరించిందేంటి అసలు మీకు ఈ మోనిత ఎక్కడ తగిలింది. అదేమో మీరు రాకపోవడానికి అదే కారణం అంటోంది అనగా అదేం లేదు అత్తయ్య అనే అబద్దాలు చెబుతుంది దీప. ఇంతలోనే సౌర్య అక్కడికి వచ్చి మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.. కానీ ఏదో ఒకటి చేసి జైల్లో పెట్టించు నానమ్మ అనడంతో మీరేం బాధపడకండి అమ్మ అది ఇంటి వైపు రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది దీప.

మరొకవైపు హేమచంద్ర దగ్గరికి కార్తీక్ రావడంతో ఏంటి కార్తీక్ మోనిత ఏమంటోంది అనగా చనిపోతాను ఆ గుండెను దీపకు మార్పిడి చేయమంటుంది అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్ అనగా నేను కూడా అలాగే షాక్ అయ్యాను హేమచంద్ర నిన్న పొద్దున అదే విషయం గురించి మాట్లాడింది ఇప్పుడు అదే విషయం గురించి మాట్లాడింది అని అంటాడు కార్తీక్. మోనిత అన్న మాటలు గురించి మాట్లాడుకుంటూ ఉండగా హేమచంద్ర మోనిత ఎంతకైనా తెగిస్తుంది కార్తీక్ పెళ్లి అయిన నిన్నే విడిచిపెట్టడం లేదు అంటే దీప కోసం కాకపోయినా నీ కోసమైనా కూడా చనిపోతుంది అని అంటాడు హేమచంద్ర. అప్పుడు వారిద్దరూ మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.