...

Karthika Deepam: కళ్ళు తిరిగి పడిపోయిన దీప.. మోనిత మాటలకు షాకైన సౌందర్య?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత గురించి కార్తీక్ హేమచంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో దీప రోజురోజుకీ ఆ మోనిత వల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. నేను చనిపోయిన తర్వాత కూడా ఆ మోనిత మా కుటుంబానికి ఇలాగే సంతోషం లేకుండా చేస్తుంది ఎలా అయినా దాని అంతు చూడాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప. ఈ జరగాలంటే నేను అత్తయ్యకి నిజం చెప్పేయాలి. అయినా కూడా మోనిత అలాగే ప్రవర్తిస్తే నేను ఎలాగో పోతాను నాతో పాటు ఆ మోనితను కూడా తీసుకుపోతాను అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే శౌర్యహిమ అక్కడికి వచ్చి నాన్న ఎక్కడ అమ్మ అని అడగగా బయటకు వెళ్లారు అని ఉంది దీప.

ఎందుకమ్మా నువ్వు ఎలాగో ఉన్నావు మా దగ్గర రావడం ఇష్టం లేదా అని సౌర్య అడగగా అలా ఎందుకు అనుకుంటున్నారు సౌర్య అని దీప అనడంతో ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య నీ ప్రవర్తన అలాగే ఉంది దీప అని అంటుంది. నాతో ఏదో విషయం చెప్తాను అన్నావు చెప్పు అని హిమ,సౌర్యను అక్కడి నుంచి పంపిస్తుంది సౌందర్య. అప్పుడు చెప్పు దీప అనడంతో ఏం లేదు అత్తయ్య హైదరాబాద్ కి వెళ్ళిపోదాం మామయ్య గురించి నాకు బెంగగా ఉంది అని అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప. అప్పుడు సౌందర్య దీప కార్తి ప్రవర్తన పై అనుమాన పడుతూ ఉంటుంది.

ఆ తర్వాత అందరూ కలిసి సంక్రాంతి పూజలు జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు సంక్రాంతి పండుగ విశిష్టత గురించి చెబుతూ ఉంటుంది సౌందర్య. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దీప హెల్త్ గురించి కార్తీక్ బాధపడుతూ ఉండగా దీప మాత్రం కార్తీక్ రెండవ పెళ్లి గురించి మాట్లాడడంతో కోపంతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. తర్వాత సౌందర్య ఇంట్లో సంక్రాంతి పండుగలు జరుపుకుంటూ ఉండగా చంద్రమ్మ పిల్లలు దీప అందరూ కలిసి ముగ్గు చుట్టూ చేరి డాన్సులు చేస్తూ ఉంటారు. అదంతా మోనిత చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి హేమచంద్ర వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతాడు. నా పేరు మోనిత నేను కార్తీక్ రెండవ భార్యని అనడంతో హేమచంద్ర మోనిత పై కోపడుతూ మాట్లాడతాడు.

మొదటి నుంచి మీరు దీప వాళ్ళకి సపోర్ట్ గా ఉండడంతో నేను మీకు విలన్ లా కనిపిస్తున్నాను అని మాయమాటలు చెబుతూ ఉంటుంది మోనిత. అప్పుడు హేమచంద్ర బట్టలు ఆరెస్తూ ఉండగా ఎంత వద్దని చెప్పినా కూడా మోనిత బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దీప డాన్స్ చేస్తూ హేమచంద్ర ఇంటి వైపు చూడగా అక్కడ హేమచంద్ర మోనిత కలిసి కనిపించడంతో అదేంటి అన్నయ్యకు ఆ మోనిత గురించి చెప్పాను కదా అనుకుంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత దీప వాళ్ళ నాన్న దీప వాళ్ళ ఫోటో చూసి బాధపడుతూ ఉండగా ఇందులో భాగ్యం వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు కాలింగ్ బెల్ మోగడంతో ఎవరా అని బయటకు వెళ్లి చూడగా దీప వాళ్ళను చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది భాగ్యం.

అప్పుడు దీప వాళ్లు భాగ్యం ని నిద్ర లేపుతూ ఉండగా ఇంతలో దీప వాళ్ళ నాన్న బయటకు వచ్చి దీపను చూసి సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు భాగ్యం కూడా కళ్ళు తెరిచి చూసి దీప వాళ్ళను చూసి సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు మా ఇంట్లో ఈ సంతోషాలు ఎప్పటికీ ఇలాగే ఉండేలా చూడు స్వామి అని సౌందర్య దేవుడిని మొక్కుకుంటూ ఉండగా ఇంతలా మోనిత అక్కడికి వచ్చి సౌందర్య మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని ప్రేమగా పలకరించడంతో ఎందుకు వచ్చావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటికి రావద్దని హైదరాబాద్కు వచ్చాము లేదు అప్పుడే దిగబడ్డావు అని సౌందర్యం అవుతుంది.

ఎందుకు ఆంటీ సీరియస్ అవుతున్నారు నేను అందుకు వచ్చాను ఒక్కసారి తెలుసుకోండి అని మోనిత అనడంతో నువ్వు ఎందుకు వస్తే నాకేంటి ముందు బయటకు వెళ్ళు అంటుంది సౌందర్య. అప్పుడు కార్తీక్ దీపల గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది మోనిత. కొడుకు కోడలు వచ్చారని సంతోషపడుతున్నారు ఆ ప్రాణం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే అన్నంతో మోనిత అనే గట్టిగా అరుస్తుంది సౌందర్య. లాభం లేదు ఆంటీ మీరు నా మాట వినేలా లేరు ముందు ఈ ఫైల్ చూడండి అప్పుడు మీ అబ్బాయి మీ కోడలు ఎందుకు ఇంటికి రాలేదు తెలుస్తుంది అని సౌందర్య కి ఫైల్ ఇస్తుంది. దీప కండిషన్ ఎలా ఉంది అని తెలిస్తే నేను దీప జోలికి వచ్చేదాన్ని కాదు అనడంతో సౌందర్య ఆ ఫైల్ చూడగా అవి చూసి ఒకసారిగా షాక్ అవుతుంది.