#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

, ,

Karthika Deepam: దీప గురించి బాధపడుతున్న హేమచంద్ర, కార్తీక్.. చంద్రమ్మపై సీరియస్ అయిన సౌందర్య?

By Ramesh Babu

Published on: January 13, 2023 9:34 AM

Updated on: January 13, 2023 9:34 AM

Follow Us

---Advertisement---

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ అసలు విషయం ఏంటో చెప్పు అని అనగా నేను నిన్ను ఏం అడుగుతున్నాను కార్తీక్ నాతో ప్రేమగా ఉండమన్నాను అంతే కదా అనడంతో పది నిమిషాలు అన్నావు మోనిత అంతకంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండను అంత ఓపిక నాకు లేదు అనడంతో సరే పాయింట్ కి వస్తున్నాను కార్తీక్. నువ్వు నాకు దక్కమని అర్థం అయింది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అనడంతో వదిలేసి వెళ్ళిపోతున్నావా ఆ పని చెయ్ మోనిత నీకు శతకోటి వందనాలు పెడతాను అని అంటాడు. అది కాదు కార్తీక్ దీప నీకు బ్రతకడం కావాలి దీప బతికే అవకాశం ఉంది అని అనడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు.

జోక్ చేయక మోనిత అనగా నేను సీరియస్గా చెబుతున్నాను కార్తీక్. నేను చనిపోతాను నా గుండెను దీపకు మార్పిడి చెయ్యి అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడైనా నా కనీసం నా గుండె చప్పుడు నా ప్రేమ నీకు అర్థమవుతుందేమో అనడంతో నాటకాలు ఆడొద్దు మోనిత అని అంటాడు. దీపను కష్టాలు పెట్టే నువ్వు దీప ఆరోగ్యంగా ఉండాలని నువ్వు గుండె ఇస్తాను అంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు నీ మాట అసలు నమ్మను అంటాడు. అప్పుడు నా గుండె చప్పుడు నువ్వు వినవచ్చు నా కొడుకుని మీరు చూసుకోండి అనడంతో ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావు సిగ్గు లేదా నీకు అసలు మానవత్వం ఉందా అంటూ మోనిత మీద సీరియస్ అవుతాడు కార్తీక్.

మరొకవైపు హేమచంద్ర కోసం కాఫీ తీసుకొని రావడంతో కార్తీక్ ఎక్కడికి వెళ్లడమ్మా అని అనగా బయటకు వెళ్లారు అన్నయ్య అనడంతో అప్పుడు వారిద్దరూ దీప హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్లకు చెప్పమ్మా అనగా చెప్పాలని ఉంది అన్నయ్య కానీ ధైర్యం చాలడం లేదు అని అంటాడు. ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. అప్పుడు దీప,సౌందర్యకి హేమచంద్రను పరిచయం చేయగా తెలుసు ఎదురింట్లో ఉండే డాక్టర్ అనడంతో అంతేకాదు అత్తయ్య నిన్ను లోయలో పడి ప్రమాద పడినప్పుడు నా ప్రాణాలను కాపాడిన దేవుడు నన్ను సొంత చెల్లెలు లాగా చూసుకున్నాడు అనడంతో మీలాంటి వాళ్ళు ఉండడం చాలా సంతోషం బాబు మీరు మా కొడుకు కోడలు పట్ల చూపిస్తున్న ప్రేమ మంచిదే కానీ నాకు అదే సమస్య అయ్యింది అని అంటుంది సౌందర్య.

ఏంటి అలా మాట్లాడుతున్నారో అత్తయ్య అనడంతో మరి మీ గురించి అడిగినప్పుడు తెలియదు అని అబద్ధం చెప్పాడు అయినా నీ తప్పు కాదులే బాబు వాళ్లపై ఉన్న అభిమానం నీతో అలా అబద్దం చెప్పించుంటుంది అని అంటుంది సౌందర్య. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు కార్తీక్ హేమచంద్ర ఎవరు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేయడంతో చాలు ఆపు మీ అందరికీ ఇంతకుముందే పరిచయం ఉందని నాకు తెలుసు అంటుంది సౌందర్య. అది కాదు మమ్మీ అని కార్తీక్ అనడంతో చాలురా వంశోద్ధార అనడంతో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు.

తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్తీక్ వాళ్ళు దీప పరిస్థితి తలచుకొని బాధపడుతూ ఉంటారు. తర్వాత చంద్రమ్మ దీప వాళ్లు పిండి వంటలు చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. అప్పుడు చంద్రమ్మ నువ్వు ఇక నుంచి వెళ్లి దీపమ్మ నేను తయారు చేస్తాను అనగా నా కోడలు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు గరిట పట్టింది అంటే చాలు అద్భుతంగా వంటలు చేస్తుంది దానిని చేయనివ్వంటుంది సౌందర్య. అప్పుడు పర్లేదులే అమ్మ అనడంతో అసలు ఏంటి మీ గోల దీపకి పొయ్యో అంటే వేడి అంటే పడినట్టు చేస్తున్నారు అంటూ చంద్రమ్మ మీద సీరియస్ అవుతుంది సౌందర్య.

మరొకవైపు కార్తీక్, హేమచంద్ర ఇద్దరూ దీప హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు.. అప్పుడు హేమచంద్ర ఇంట్లో వాళ్లకు చెప్పి గారికి అనడంతో వాడు నిజం తట్టుకోలేరు హేమచంద్ర అని అనగా నువ్వే తట్టుకున్నావ్ కదా కార్తీక్ వాళ్ళు ఎంత చెప్పు. దీప ని ఎక్కువగా ప్రేమించేది నువ్వు మాత్రమే ఇంట్లో వాళ్లకు తెలియక ముందే నువ్వు చెప్పడమే మంచిది అని అంటాడు.

, , , , ,

Join our WhatsApp Channel