Malli Nindu Jabili serial September 23 Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వసుంధర, మల్లిని పిలిచి.. మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు అని అడగడంతో మల్లి హైదరాబాదులో అని మా అమ్మ చెప్పింది. ఇంకేం చెప్పింది మీ అమ్మ.. మీ నాన్న గురించి. మీ అమ్మ కి ఫోన్ చేసి మీ నాన్నగారి గురించి అడుగు.. అనడంతో శరత్ చంద్ర షాక్ అవుతాడు.. అరవింద్ కుటుంబసభ్యులంతా వివరాలు తెలిస్తే మంచిదే కదా ఫోన్ చేయమంటారు. మీరా నా గురించి చెపితే వసుంధర పెద్ద గొడవ చేస్తుంది.
మరోవైపు అరవిందు, మల్లి అమ్మ అల్లుడు నా గురించి అడిగితే అని టెన్షన్ పడతాడు.. వసుంధర మనసులో మల్లి ఈ రోజు ఈ నాటకం బయటపడుతుంది. అరవింద్ పాత్ర ఎంత ఉందో తెలుస్తుంది. మీరా ఫోన్ తీసుకొని మల్లి అంటుంది. మల్లి మా నాన్న గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అమ్మ.. నాన్న గురించి చెప్పవా. నా జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. మీ నాన్నగారి గురించి నీకు ఇంతకు ముందే చెప్పాను నాకు తెలిసింది ఒక్కటే ఆయన నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం.. ఆయన పట్నం నుంచి వచ్చినారు మళ్లీ వస్తానని మాట ఇచ్చారు తప్పకుండా వస్తారు.
ఆయన మీద నాకు నమ్మకం ఉంది. మల్లి 18 సంవత్సరాలు అవుతుంది అమ్మ ఇంకా నమ్మకం ఉందా.. మీరా ఆయన రాలేకపోయాడు ఏమో కానీ రాకుండా మాత్రం ఉండడు.18 ఏళ్ళు అయినా 30 ఏళ్లయినా కచ్చితంగా వస్తారు. ఈ ప్రపంచం ముందు నేను తన భార్యని నువ్వు తన కూతురు అని ఒప్పుకుంటాడు. ఇంకొకసారి మీ నాన్న గురించి ఆయన రారు అని అనడానికి కానీ ఇంకెప్పుడు ఫోన్ చేయకు మల్లి..మీరు ఫోన్ పెట్టేస్తుంది. మల్లి, వసుంధర తో విన్నారు కదా.. మా అమ్మ ఏమన్నదో మా నాన్న ఏదో ఒకరోజు తిరిగి వస్తారనే నమ్మకం తో ఉంది.
Malli Nindu Jabili serial : మల్లి ఊహించని ప్రశ్న.. అరవింద్‌ను నిలదీసిన సత్య..
ఇప్పుడు మీకోసం నా భవిష్యత్ కోసం మా అమ్మ నమ్మకాన్ని పోగొట్టాలి నేను.. అప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించను. వసుంధర, నేను మీ అమ్మను నిన్ను బాధపెట్టాలని చేసినట్టు మాట్లాడుతున్నావ్.. అరవింద్ కుటుంబ సభ్యులు మల్లి ఉద్దేశం అది కాదు.. వసుంధర తప్పు నాదే అని వెళుతుంది. శరత్ చంద్ర నామీద నాకే కోపం గా ఉంది నిన్ను దూరం చేసుకున్నందుకు అని బాధ పడుతూ ఉండగా.. మల్లి, శరత్ చంద్ర కు థాంక్యూ చెప్తుంది. మల్లి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉండగా శరత్ చంద్ర వచ్చి కంగారు పడకు బాధపడకు వసుంధర ఎవరికీ తెలియ కుండా నువ్వు ఈ సమస్య నుండి బయట పడాలి.
ఒక ఉపాయం చెప్తాడు. ఎప్పుడూ కన్నతండ్రి అని అనుకో మల్లి.. నువ్వు నన్ను కన్న కూతురిలా మీరు కాపాడారు. వసుంధర నుండి తప్పించుకోవడానికి శరత్ ఈ సహాయం చేసినందుకు మల్లి కృతజ్ఞతలు చెబుతోంది. నీ కన్న తండ్రిని చెప్పుకోలేని పరిస్థితి లో ఉన్నాను అని బాధ పడతాడు. బాగా చదువుకోవాలనే మీ అమ్మ కోరిక నెరవేర్చు మల్లి అంటాడు శరత్.. మీ అమ్మ నాన్న నువ్వు సంతోషంగా ఉండే రోజు వస్తుంది. శరత్ చంద్ర తో వసుంధర మల్లి నాటకం ఆడుతుంది.
ఆ ఇంట్లో నుంచి వెళ్ళడం ఇష్టం లేక.. అని కోపంగా చెప్తుంది. శరత్ వాళ్ల అమ్మానాన్న స్థానంలో ఉండి మల్లి పెళ్లికి మనము ఇద్దరం పెళ్లి చేద్దాం.. వసుంధర, శరత్ చంద్ర మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు మీరా ఆలోచిస్తూ ఉండగా సత్య వస్తాడు. మల్లి ఫోన్ చేసింది. మ ల్లి వాళ్ల నాన్న గురించి అడిగింది. మల్లి ఊహించని ప్రశ్న గురించి మీరా చెప్పడంతో సత్య కంగారుపడ్డాడు.. అరవింద్ కి ఫోన్ చేసి అక్కడ ఏమి జరుగుతుంది అని అడుగుతాడు.. మరో ట్విస్ట్ అరవింద, శరత్ చంద్ర మాట్లాడుతుండగా వసుంధర వింటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి..