Guppedantha Manasu serial Oct 3 Today Episode : తెలుగు బుల్లితెర పై పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మహేంద్ర, దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు పని చేసే కాఫీ రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ రిషి కూర్చునే ఉండగా వసుధార మాత్రం వేరే వాళ్ళ ఆర్డర్ తీసుకొని వాళ్లకు సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార రిషికి కాఫీ తీసుకొని రాగా అప్పుడు రిషి కూర్చో నీతో మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు సర్ నేను డ్యూటీలో ఉన్నాను సరే నేను వెళ్ళిపోతాను అని అంటాడు రిషి.
అప్పుడు వసు కూర్చోవడంతో నువ్వు ఈ డ్యూటీ మానేసి మంత్రి గారు చెప్పినట్టు సివిల్ కి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని రిషి అడగగా వెంటనే వసు వద్దు సార్ నేను మీలాగా జగతి మేడం లాగా లెక్చరర్ అవుతాను అని అంటుంది. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అపుడు వసు ఎందుకు రిషి సార్ ఇంత కోపంగా ఉన్నారు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు ధరణి దేవయానికి భోజనం వడ్డిస్తూ ఉండగా అప్పుడు దేవయాని మహేంద్ర వారి గురించి అడగడంతో నాకు తెలియదు అత్తయ్య అని అంటుంది ధరణి.
ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అది గమనించిన దేవయాని కావాలని రిసీవ్ వినిపించే విధంగా వాళ్ళు నామీద అలిగినట్టు ఉన్నారు అని అంటుంది. ఇంతలోని రిషి అక్కడికి వచ్చి ఏమైంది పెద్దమ్మ అని అనగా అప్పుడు దేవయాని జరిగింది మొత్తం చెబుతూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే జగతి, మహేంద్ర లు అక్కడికి వస్తారు.
గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్ 3 ఈరోజు ఎపిసోడ్ : వసుధారను పొగిడిన రిషి.. రగిలిపోయిన దేవయాని..
అప్పుడు మహేంద్ర రిషికి అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించినా కూడా రిషి మాత్రం వినిపించుకోకుండా దేవయాని మాటలు నమ్మి నాకు అవసరం లేదు డాడీ మీరు పెద్దమ్మని ఏ కారణం చేత కూడా మాట అన్నా సరే నేను ఊరుకోను. ఆవిడ బాధపడడానికి వీలు లేదు అని అంటాడు. అప్పుడు మహేంద్ర అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించినా కూడా రిషి వినిపించుకోడు.
అప్పుడు చూసి మీరు పెద్దమ్మని ఏ ఉద్దేశంతో మాట అన్నా సరే పెద్దమ్మకు సారీ చెప్పండి డాడ్ అని అంటాడు. వెంటనే మహేంద్ర నేను సారీ చెప్పాను నేను తప్పు చేయలేదు అని అనటంతో మీరు సారీ చెప్పకపోతే నేను అన్నం తినను డాడ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా మహేంద్ర సారీ చెబుతాడు. అప్పుడు మహేంద్ర వదిన గారు రిషి ని తీసుకురండి నాకు రిషి ముఖ్యం అందుకోసం నేను ఎన్ని మెట్లు అయిన దిగుతాను అని అనగా వెంటనే దేవయాని మనసులో ఇంకా కిందికి దిగజార్చుతాను మహేంద్ర అనుకుంటూ రిషి ని పిలుచుకొని వచ్చి భోజనం పెడుతుంది.
అప్పుడు మహేంద్ర అక్కడి నుంచి తినకుండా వెళ్ళిపోతూ ఉండగా రిషి మహేంద్ర చెయ్యి పట్టుకొని జగతిని కూడా తినమని చెబుతాడు. ఇప్పుడు రిషి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి అడగగా జగతి డల్ గా సమాధానం చెబుతుంది. ఇప్పుడు దేవయాని వసుధార పేరు ఎత్తడంతో ఇంటిలోనే వసు, రిష్ కీ ఫోన్ చేస్తుంది. ఆ తరువాత రిషి వసుధార గురించి గొప్పగా పొగుడుతూ మాట్లాడడంతో దేవయాని షాక్ అవుతుంది. మరొకవైపు వసుధార ఫోన్లో రిషి ఫోటో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోవైపు రిషి కూడా వసుధార ఫోటోని చూస్తూ ఫోన్ చేయొచ్చు కదా అని ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World