Macherla Niyojakavargam Movie Review : యంగ్ హీరో నితిన్ రెడ్డి (Nithiin) ఈసారి ట్రాక్ మార్చాడు. ఎప్పుడు లవ్ ట్రాక్‌లతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించిన నితిన్.. సరికొత్తగా కనిపించాడు. ఇప్పటివరకూ టచ్ చేయని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam Movie Review) అంటూ ఆగస్టు 12న (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చేశాడు. గతంలో నితిన్ నటించిన చెక్, మ్యాస్ట్రో, రంగ్‌దే మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
అప్పుడెప్పుడో భీష్మ మూవీతో నితిన్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత తన ఖాతాలో ఒక్క సరైన హిట్ పడలేదు. అప్పటినుంచి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో నితిన్.. ఈసారి డిఫరెంట్ లుక్‌తో మాచర్ల నియోజకవర్గమంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో మాచర్ల నియోజకవర్గం మూవీ (Macherla Niyojakavargam Movie Release) తెరకెక్కింది. ఈ మూవీలో నితిన్‌కు జోడీగా కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెస్సా (Catherine Tresa) నటించారు.
నటీనటులు వీరే :
ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు. మిగిలిన పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, సముద్ర ఖని నటించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌గా తెరకెక్కించిన ఈ మూవీ శ్రేష్ట మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మాచర్ల నియోజకవర్గం మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్లు, పోస్టర్లు, పాటలు హిట్ టాక్ అందుకున్నాయి. అనుకున్నదాని కన్నా భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆగస్టు 12న థియేటర్లో రిలీజ్ అయింది. ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలియాలంటే ఓసారి రివ్యూలోకి వెళ్లాల్సిందే..
Movie Name : | Macherla Niyojakavargam (2022) |
Director : | ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి |
Cast : | నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, మురళి శర్మ, సముద్ర ఖని |
Producers : | సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి |
Music : | మహతి స్వర సాగర్ |
Release Date : | 12 ఆగస్టు 2022 |
అసలు స్టోరీ ఇదే :
మాచర్ల నియోజకవర్గం మూవీ స్టోరీ.. నితిన్ కలెక్టర్ రోల్‌లో అద్భుతంగా నటించాడు. ఒక కలెక్టర్‌గా నితిన్ అవినీతి రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తాడు. గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్రలో నితిన్ తనదైన నటనతో మెప్పించాడు. మాచర్ల నియోజకవర్గం మూవీ పొలిటికల్ కథాంశంతో తిరుగుతుంది. ఆ జిల్లాల్లో ఏళ్ల పాటు ఎన్నికలు జరగవు. ఆ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన నితిన్ అక్కడి పరిస్థితులను సరిచేస్తాడు. దగ్గరుండి ఎన్నికలు జరిపిస్తాడు. ఆ సమయంలో నితిన్ జిల్లా కలెక్టర్‌గా సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడనేది స్టోరీ లైన్ ఇది..
పొలిటికల్ నేపథ్యంలో రావడంతో మాచర్ల నియోజకవర్గం మూవీపై భారీ అంచనాలను పెంచింది. ప్రస్తుత రాజకీయాలపై ఏదైనా పాయింట్స్ ఉన్నాయనే ఇంట్రెస్ట్ ఆడియన్స్‌లో వచ్చింది. ఇక పాటల విషయానికి వస్తే.. ‘రారా రెడ్డి ఐ యామ్ రెడీ..’ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీలో నితిన్ కలెక్టర్ రోల్ ఆకట్టుకునేలా ఉంటుంది. నితిన్‌కు పోటీగా కృతిశెట్టి కూడా తనదైన నటనతో మెప్పించింది. ప్రత్యేకించి ఈ మూవీలో నితిన్ డైలాగ్స్ బాగా పేలాయి. పాటలు అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ మూవీలోని పాటలకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీలో కామెడీ కూడా పెద్ద ప్లాస్ పాయింట్స్ గా నిలిచింది.
కాకుంటే.. కొన్ని చోట్ల సీన్లు బాగా సాగదీసినట్టుగా అనిపించింది. టెక్నికల్‌గా మూవీ కూడా బాగా వచ్చింది. మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. మూవీలో పంచ్ డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తం మీద మాచర్ల నియోజకవర్గం మూవీ అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. లవ్ ట్రాక్‌లతో మెప్పించిన నితిన్ ఈసారి పొలిటికల్ నేపథ్యంలో సాగే మూవీని ఎంచుకుని మరో సాహసం చేశాడు. కొత్తగా కనిపించిన నితిన్ కోసమైన ఈ మూవీని చూడవచ్చు. ఫైనల్‌గా అన్నిరకాల ప్రేక్షకులు కలిసి వెళ్లి చూడాల్సిన సినిమా.. ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్లకు వెళ్లి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
[ Tufan9 Telugu News ]
మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ
రేటింగ్ : 3.80/5