Samantha food: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క్రెడిట్ కు దగ్గట్లు సినిమాల్లో నటించి తెలుగు, తమిళ, ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాది చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ కెరియర్ పైనే దృష్టి పెట్టింది. వరుస చిత్రాలను అనౌన్స్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే కాస్త సమయం ఉన్నప్పుడల్లా ఆయా ప్రదేశాలను, పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఫొటోషూట్లు, గుళ్లు గోపురాలు తిరుగుతోంది. ఈ క్రమంలో సమంత చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయానికి ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లింది. అక్కడ సమంత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తాను చదువుకునే రోజుల్లో మా అమ్మా, నాన్న నన్ను చాలా కష్టపడి చదివించారని తెలిపింది. 10, 12వ తరగతిలో బాగా చదివి కాలేజ్ టాపర్ గా నిలిచినట్లు వివరించింది. కానీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు మా తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోయిందన వాపోయింది. దీంతో నా కలలకు గమ్యం లేదు. భవిష్యత్ కూడా లేదంటూ వివరించింది. అలాగే ప్రతీ ఒక్కరూ తమ తల్లిదండ్రులు తమ నుంచి ఆశించే మార్గంలో నడవాలని అన్నారు. దాంతో పాటు పెద్ద గోల్స్ పెట్టుకోవాలని సూచించారు. తాను చదువుకునే రోజుల్లో.. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసానని, పలు చోట్ల ఉద్యోగాలు చేశానని వివరించింది. ఇంత కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపింది.