Viral news: చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. చూసేందుకు లడ్డుగా.. బుజ్జి బుజ్జి మాటలతో తెగ అల్లరి చేసేస్తుంటారు. అంతేనా బుడి బుడి అడుగులు వేస్తూ భలే మైమరిపిస్తుంటారు. వారి చేష్టలు చూస్తే ఎంత కోపంలో ఉన్న వాళ్లయినా ఇట్టే కరిగిపోవాల్సిందే. అయితే అలాంటి ఓ ఘటనే తాజాగా జరిగింది. తరగతిలోని పిల్లలంతా అల్లరి చేస్తుండటంతో ఓ బాలుడితో నువ్వు నాతో మాట్లాడొద్దు ఇక నుంచి అని ఓ టీచర్ చెప్పింది. దానికి భయపడిపోయిన ఆ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్ మీదకు ఎక్కి కూర్చున్నాడు. అయితే బాలుడు అంత ప్రేమగా సారీ చెప్పినా ఆ టీచర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
నీవెప్పుడూ ఇలాగే చేస్తావంటూ అంది. నీతో ఇక మాట్లాడనంటూ అలక నటించింది. అందుకు బుడ్డోడు బదులిస్తూ…. మళ్లీ క్లాస్ లో అల్లరి చేయనని చెప్పాడు. ఇది చివరిసారి అనడంతో.. రెండు ముద్దులు పెట్టాడు. దీంతో టీచరమ్మ అలకను వీడింది. బుడ్డోడికి రిటర్న్ కిస్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ టీచరమ్మను భలే ఐస్ చేశావ్ రా బుడ్డోడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था 😏😌 pic.twitter.com/uHkAhq0tNN
Advertisement— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 12, 2022
Advertisement