Tolly wood Heroines:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలో గ్లామర్ రోజు చేయడానికి ఇష్టపడుతుంటారు ఇలా గ్లామర్ రోజు చేయటం వల్ల వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. ఏ హీరోయిన్ కూడా పెళ్లై పిల్లలు ఉన్న పాత్రలలో నటించారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది హీరోయిన్లు గర్భవతుల పాత్రలలో నటించి మెప్పించారు. మరి ఇలా గర్భవతులుగా నటించిన హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే…
అనుష్క: బాహుబలి సినిమాలో గర్భవతి పాత్రలో నటించి మెప్పించారు.
సౌందర్య: 9 నెలలు సినిమాలు ఈమె నిండు గర్భిణిగా నటించి సందడి చేశారు. ఈ సినిమాలో తన భర్తను కాపాడుకోవడం కోసం ఈమె సరోగసి పద్ధతి ద్వారా తల్లి అయినట్టు చూపించారు.
కీర్తి సురేష్: కీర్తి సురేష్ రంగ్ దే, పెంగ్విన్ వంటి చిత్రాలలో గర్భిణీగా కనిపించారు.
సాయి పల్లవి: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ‘పావ కథాగల్’ చిత్రంలో గర్భవతిగా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా థియేటర్లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
నిత్యామీనన్: విజయ్ ‘మెర్సల్’ సినిమాలో ఈమె నిండు గర్భిణీ పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో విడుదలైంది.
Tolly wood Heroines:
అనసూయ: యాంకర్ అనసూయ థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నిండు గర్భిణీ పాత్రలో నటించారు.
స్నేహ: అమరావతి సినిమాలో స్నేహ గర్భవతి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సమంత:సమంత తాజా చిత్రం యశోద సినిమాలో ఈమె గర్భిణీగా కనిపించబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ ద్వారా తెలుస్తోంది.
కీర్తి రెడ్డి: ఈమె మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో తన అక్క పాత్రలో నటించారు ఈ సినిమాలో ఈమె నిండు గర్భిణీ పాత్రలో నటించారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World