Karthikeya 2 Movie Review : ప్రయోగాలకు పెట్టింది పేరు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ఏదో ఒక కాన్సెప్ట్ ఎంచుకోవడం ద్వారా నిఖిల్ సక్సెస్ ఫార్ములా.. అదే ఇప్పుడు కార్తికేయ 2 సీక్వెల్ వరకు వచ్చింది. కార్తికేయ మూవీ భారీ విజయంతో నిఖిల్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2019లో తమిళ్ రీమేక్ అర్జున్ సురవరం మూవీ.. ఇదే నిఖిల్ చివరి సినిమా. ఆ తర్వాత సినిమా చేయలేదు నిఖిల్. కార్తీకేయ మూవీ హిట్ టాక్ అందుకోవడంతో అదే చిత్ర యూనిట్ కార్తికేయ 2 సీక్వెల్ తీసుకొచ్చింది. మొదటి నుంచి ఈ మూవీకి అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు కార్తీకేయ 2 మూవీ (Karthikeya 2 Movie Release) ఆగస్టు 13, 2022న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇంతకీ కార్తికేయగా నిఖిల్ మరోసారి తన నటనతో మెప్పించాడా? లేదా అనేది తెలియాలంటే ఓసారి రివ్యూ చూడాల్సిందే.

అసలు స్టోరీ ఇదే :
కార్తికేయ 2 మూవీలో నిఖిల్ డాక్టర్.. అతడు వైద్యుడిగా తన వృత్తిని సాగిస్తూనే కొన్ని అంతుపట్టని ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషిస్తుంటాడు. కార్తికేయ ఫస్ట్ పార్ట్ మాదిరిగానే సీక్వెల్ మూవీ కార్తికేయ 2లోనూ నిఖిల్.. ఆ రహస్యాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటాడు. మొదటి కార్తికేయలో సుబ్రహ్మణ్యపురంలో మాదిరిగానే ద్వారకలో జరిగే పరిస్థితుల వెనుక రహస్యాన్ని నిఖిల్ అన్వేషిస్తాడు. అతని సత్యాన్వేషణ కొన్ని పురాతన నమ్మకాలకు, ద్వారకలోని శ్రీకృష్ణుని శక్తికి సంబంధించిన అనేక రహస్యాలను వెలికితీస్తుంది. ఈ సినిమాలో కార్తికేయగా నిఖిల్ ఆ రహస్యాలను చివరికి కనుగొన్నాడా లేదో అనేది మిగిలిన కథ.. చాలా ఆసక్తిగా సాగుతుంది.
నటీనటులు వీరే :
కార్తికేయ 2లో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా.. అనుపమ పరమేశ్వరన్ నిఖిల్‌కు జోడీగా నటించింది. మిగతా నటీనటుల్లో ఆదిత్య మీనన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య, హర్ష చెముడు, K.S శ్రీధర్ నటించారు. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్, TG విశ్వ ప్రసాద్ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంగీతం కాల భైరవ సంగీతాన్ని అందించగా.. సినిమాటోగ్రాఫర్ & ఎడిటర్‌గా కార్తీక్ ఘట్టమనేని పనిచేశారు.
Movie Name : | Karthikeya 2 (2022) |
Director : | చందూ మొండేటి |
Cast : | నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, K.S శ్రీధర్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య & హర్ష చెముడు |
Producers : | TG విశ్వ ప్రసాద్ & అభిషేక్ అగర్వాల్ |
Music : | కాల భైరవ |
Release Date : | 13 ఆగస్టు 2022 |
Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 మూవీ రివ్యూ.. నిఖిల్ ఎంతవరకు మెప్పించాడంటే?
సినిమా విషయానికి వస్తే.. కార్తికేయ 2 మూవీ (Karthikeya 2 Movie Review) చూస్తున్నంత సేపు.. కార్తికేయ మొదటి పార్ట్ (Karthikeya Movie) మాదిరిగానే అనిపిస్తుంది. అయితే నిఖిల్ కాన్సెప్ట్ పాతది అయినా కొత్తగా అనిపించేలా మెప్పించాడు. ఈ మూవీలో మిస్టరీ అనేది ప్లస్ పాయింట్.. ఫాంటసీగా ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌లో మాత్రం అదిరే ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్‌లో క్లైమాక్స్ వరకు అంతే ట్విస్ట్ నడుస్తుంది. దర్శకుడు చందూ మూవీకి అదిరే క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

నటన విషయానికి వస్తే.. నటన పరంగా, నిఖిల్ కార్తికేయ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన నటనతో మరోసారి మెప్పించాడు నిఖిల్. అంతుపట్టని రహస్యాలను అన్వేషించే పాత్రలో నిఖిల్ అద్భుతంగా నటించాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎప్పటిలానే తన పాత్రకు తగినట్టుగా నటించింది. మరోవైపు అనుపమ్ ఖేర్ బాగానే నటించాడు. డబ్బింగ్ వాయిస్ అతడికి పెద్దగా వర్కౌట్ అయినట్టు లేదు. ఆదిత్య మీనన్ నెగిటివ్ రోల్‌లో అద్భుతంగా నటించాడు. శ్రీనివాస రెడ్డి కొన్ని సీన్లలో తనదైన టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర నటీనటులంతా కథానుగుణంగా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ పరంగా.. కార్తికేయ 2 షాట్‌లు విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవ సంగీతం బాగుంది. కానీ, సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. కార్తీక్ ఘట్టమనేని విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో కొన్ని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీతో చందూ మొండేటి దర్శకుడిగా తన ఫామ్ చూపించాడు. ఫైనల్‌గా చూస్తే.. కార్తికేయ 2 సీక్వెల్.. అందులోని విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉన్నాయనే చెప్పాలి. అందుకే కార్తికేయ 2 మూవీ విజువల్స్ కోసమైనా తప్పనిసరిగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
[ Tufan9 Telugu News ]
కార్తికేయ 2 మూవీ
రివ్యూ & రేటింగ్ : 3.68/5
Read Also : Macherla Niyojakavargam Movie Review : మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ.. నితిన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్..!