Devatha July 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవుడమ్మ చేతిలో ఉన్న రుక్మిణి ఫొటో సత్యకు దొరుకుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య దేవికి తన చిన్నప్పటి నుంచి గెలిచిన గిఫ్టులు ప్రైజులు అన్ని చూపిస్తూ ఉంటాడు. దేవి వాటిని చూసి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య నేను చెస్ లో స్టేట్ ఫస్ట్ అని అనగా అప్పుడు దేవి కూడా నేను కూడా చెస్ బాగా ఆడతాను అని అనడంతో అప్పుడు ఆదిత్య మనం చెస్ ఆడదామా అని అనగా సరే అని అంటుంది.

Devatha July 9 Today Episode
మరొకవైపు.. రాధ జానకి అన్న మాటలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రామ్మూర్తి జానకి వచ్చి చిన్మయి విషయంలో జానకి ఆ విధంగా మాట్లాడినందుకు క్షమించమని అని కోరుతూ జానకి కావాలని అనలేదు తన మనసులో వేరే ఆలోచన ఉంది అందుకే అలా మాట్లాడింది అని చెబుతాడు రామ్మూర్తి. మరొకవైపు ఆదిత్య దేవి ఇద్దరు కూర్చుని సీరియస్ గా చెస్ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు ఆదిత్య గెలవడంతో దేవి ఓడిపోయాను అని ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య ఓటమి గెలుపు గురించి వివరిస్తూ ఓడిపోతే బాధపడకుండా పట్టుదలతో మళ్ళీ ఆట గెలిచి నిరూపించుకోవాలి అని అనగా వెంటనే దేవి నేను ఆట గెలిచే వరకు మా ఇంటికి వెళ్ళను అంటూ ఆదిత్య ఒక మాట ఇస్తుంది.
Devatha July 9 Today Episode : దగ్గరవుతున్న ఆదిత్య, దేవి.. సత్య మాటలకు షాక్ అయిన ఆదిత్య..?
అప్పుడు ఆదిత్య ఇదే పట్టుదలతో ఉండాలి అని సంతోషంగా దేవిని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత దేవి ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఉండగా ఇందులో భాగ్యమ్మ వచ్చి పక్కకు తీసుకొని వెళ్లి తన తెచ్చిన పండ్లు దేవికి ఇస్తుంది. అప్పుడు దేవి రోజు స్కూల్లో ఇస్తున్నావు కదా అమ్మమ్మ ఇప్పుడు ఎందుకు అని అనగా ఈ పొద్దు నువ్వు స్కూల్ కి పోలేదు కదా అందుకే ఇక్కడికి తెచ్చాను అని అంటుంది భాగ్యమ్మ. అయితే ఆ మాటలు విన్న భాష, కమల ఆశ్చర్యపోతారు.
అప్పుడు దేవిని అక్కడే ఉండి పండు తినమని చెబుతూ భాగ్యమ్మ అక్కడి నుంచి వెళుతుంది. ఆ తర్వాత భాగ్యమ్మ డబ్బులు తీసుకుని వచ్చి దేవికి ఇస్తూ ఉండగా అది చూసి కమలా వాళ్ళు కచ్చితంగా ఏదో జరుగుతుంది అని అనుమాన పడతారు.ఆ తరువాత దేవుడమ్మ రుక్మిణి ఫోటో కనిపించకపోయేసరికి బాధపడుతూ ఇంటికి వచ్చి ఆదిత్య కు నిజం చెబుతుంది. ఎలాగైనా రుక్మిణి వెతికి పెట్టాలి అని దేవుడమ్మ చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక సత్య ఆ ఫోటో నేనే తీశాను అనటంతో ఆదిత్య షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha july 8 Today Episode : కమల పై సీరియస్ అయిన భాగ్యమ్మ..రుక్మిణిని వెతికే పనిలో పడిన దేవుడమ్మ..?