Jabardast Satya Sri : బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కామెడీ షో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. హాస్య ప్రియులకు బెస్ట్ ఛాయిస్‌గా నవ్వులు పంచే కామెడీ షోగా ఉండేది. చిన్నపిల్లలు పెద్దవాళ్లు అనే తేడా లేకుండా అందరిని అంతగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా తెలుగు ప్రజలు జబర్దస్త్ కామెడీ షోను చూసి ఎంజాయ్ చేస్తారు. అంతగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ జబర్దస్త్ షోలో కనిపించే లీడర్స్, కంటెస్టెంట్స్ పేర్లు ఆడియోన్స్ మైండ్లో రిజిస్టర్ అయిపోయాయి.
జబర్దస్త్ పాపులర్ జోడీ అనగానే అందరిగా బాగా గుర్తొచ్చే పేర్లు.. సుడిగాలి సుదీర్, రష్మీ.. ఆ తర్వాత పాపులర్ కంటెస్టెంట్లలో సుధీర్ తర్వాత గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, చలాకి చంటి అనేక మంది బ్రాండ్ నేమ్ సొంతం చేసుకున్నారు. అదే సమయంలో చాలామంది నటుడు కావాలనుకునేవారు జబర్దస్త్ షోకి వెళ్లాలని ఆశపడేవారు. ముఖ్యంగా మెయిల్ యాక్టర్స్ బాగా ఉత్సాహం చూపేవారు.
ఆ తర్వాత అమ్మాయిలు కూడా జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేడీ గెటప్ వేసే అబ్బాయిల స్థానంలోకి వర్ష, సత్యశ్రీతో పాటు మరికొంత మంది అమ్మాయిలు కూడా వచ్చేశారు. ఇక జబర్దస్త్‌లో అవకాశం కావాలంటే టీమ్ లీడర్స్ అనుమతి తీసుకోవాలి. వందల మంది పోటీ పడుతున్న సమయంలో జబర్దస్త్ టీం లీడర్స్ టాలెంట్ ఉన్న వారికి, వాళ్లకి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే ఛాన్స్ ఇచ్చేవారు. ఆ సమయంలో జబర్దస్త్‌లో కాస్టింగ్ కౌచింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
Jabardast Satya Sri : చమ్మక్ చంద్రతో సత్యశ్రీ అఫైర్.. వీడియో చూపించి క్లాస్ పీకిన తండ్రి..
జబర్దస్త్ షోలో నటించిన లేడి కమెడియన్స్‌లో సత్య శ్రీ ఒకరు. ఆమెను చమ్మక్ చంద్ర తీసుకొచ్చారు. సాధారణంగా జబర్దస్త్‌లోకి వచ్చిన వెంటనే స్కిట్‌లో ప్రాధాన్యత ఇవ్వరు. చమ్మక్ చంద్ర ,సత్యకు మొదటి నుంచే స్కిట్‌లో పెద్ద రోల్ ఇచ్చేవాడు. ఎక్కువగా వారిద్దరు భార్యాభర్తల పాత్రలు చేసేవారు. జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోయే వరకు చమ్మక్ చంద్రతోనే స్కిట్స్ చేసేది. చమ్మక్ చంద్ర వెళ్లిపోవడంతో సత్య కూడా షో నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరు కలిసి స్కిట్ చేస్తున్న సమయంలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. పెళ్లి అయిన చమ్మక్ చంద్రతో సత్య ఎఫైర్ నడుపుతుందని ఆరోపణ వచ్చాయి. చమ్మక్ చంద్రకు దగ్గర కావడం వల్లనే సత్య శ్రీకి జబర్దస్త్‌లో చోటు దక్కింది అన్న వాదనలు సైతం తెరపైకి వచ్చాయి.
ఈ వార్తలపై ఇటీవల సత్య శ్రీ స్పందించింది. ఈ పుకార్లు తన వరకు వచ్చాయని తెలిపింది. అయితే చంద్రతో అఫైర్ ఉందంటూ వచ్చిన వార్తలపై ముందుగా తనను ఫస్ట్ అడిగింది తన నాన్నగారే అనే విషయం సత్యశ్రీ రివీల్ చేసింది. ఒక యూ ట్యూబ్ వీడియోను చూపించి.. చంద్రతో నీకు అఫైర్ ఉందని అంటున్నారని అడిగాడట.. మీరు ఏమకుంటున్నారు నాన్న తాన అడిగానని చెప్పింది. చమ్మక్ చంద్ర గురించి నాకు తెలుసు, నీ గురించి కూడా నాకు తెలుసు.. ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అంటే.. నువ్వు ఎదుగుతున్నావ్ అని అర్థమని అన్నారట. అదే విషయాన్ని సత్యశ్రీ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.
Read Also : Chammak Chandra : చమ్మక్ చంద్ర బ్యాక్ టు జబర్దస్త్? ఛాన్స్ దక్కుతుందా?