Jabardasth Yedukondalu : బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో అంటే తెలియని వారంటూ ఉండరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా జబర్దస్త్ కామెడీ షో అంతగా గుర్తింపు వచ్చింది. ఈ షోతో ఎంతోమంది కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయమయ్యారు. ఏమైందో తెలియదు కానీ.. ఈ షోలో పనిచేసిన కమెడియన్స్ చేసిన విమర్శలతో వివాదాలలో నడుస్తుంది. ముఖ్యంగా కిరాక్ ఆర్పి, అప్పారావు చేసిన విమర్శలు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. జబర్దస్త్‌లో కనీసం మర్యాద కూడా ఇవ్వరని ఫుడ్ సరిగా పెట్టరని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగలేదు.. పైగా నాగబాబే కమెడియన్లకు సహాయం చేసేవాడంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై స్పందించిన హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్.. ఆర్పీ వంటి కమెడియన్ల విమర్శలను కొట్టిపడేశారు. మల్లెమాల లాంటి మంచి ప్రొడక్షన్ ఎక్కడ ఉండదని అన్నారు. అందులో పనిచేసే కంటెస్టెంట్స్ ఎంతగానో ఆదరిస్తారని చెప్పారు. జబర్దస్త్ కమెడియన్లు ఇలా ఒక్కొక్కరుగా ఒక్కోలా మాట్లాడుతుండటంతో.. అసలు ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఆడియోన్స్‌లో నెలకొంది. అయితే లేటెస్టుగా జబర్దస్త్ ప్రొడక్షన్ మేనేజర్ ఏడుకొండలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏడుకొండలు పలు ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు.
Jabardasth Yedukondalu : అసలు జబర్దస్త్‌లో ఏం జరుగుతోంది.. ప్రొడక్షన్ మేనేజర్ ఏడుకొండలు సంచలన వ్యాఖ్యలు..
కొందరు ఈ కామెడీ షోపై చేస్తున్నా విమర్శలు సరికాదని ఆయన కొట్టిపారేశారు. మెగా బ్రదర్ నాగబాబు, రోజా రెమ్యూనరేషన్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. ఏడుకొండలు చెప్పిన ఆన్సర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జబర్దస్త్‌లో పనిచేసే కమెడియన్స్‌కి అలాగే జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా, నాగబాబుల రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆడియన్స్‌కి ఎప్పటికీ ఉంటుంది. అయితే టాప్ కమెడియన్లు లక్షల్లో పారితోషికం తీసుకుంటారని ఏడుకొండలు రివీల్ చేశారు. అయితే, నాగబాబు, రోజా ఎపిసోడ్ చొప్పున తీసుకుంటారని చెప్పుకొచ్చారు. రోజా, నాగబాబు రెమ్యునరేషన్ ఎంత ఉంటుందనేది నెట్టింట్టో ఈ న్యూస్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.
జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు ఇప్పుడు వీరిద్దరి రెమ్యూనరేషన్ ఎంతో బయటపెట్టేశారు. రోజా పలు సినిమాల్లో టాప్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ఆమె తన గ్లామర్‌తో జనాల్లో ఎక్కువ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అందుకే.. రోజాకు ఎక్కువ పారితోషకం ఇస్తామని, నాగబాబు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేయటంతో తక్కువ పారితోషికం ఇస్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎవరైనా హీరోలు జబర్దస్త షోకి గెస్ట్‌గా వచ్చినప్పుడు వారికి కొంత మొత్తంలో ఎక్కువగానే పారితోషకం ఇస్తామని ఏడుకొండలు చెప్పారు. చివరిగా.. సీనియారిటీతో సంబంధం లేకుండా పారితోషికంలో జబర్దస్త్ షోలో చూపించే తేడాలు ఉన్నాయంటూ నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటోంది.
Read Also : Jabardast Satya Sri : చమ్మక్ చంద్రతో జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్యకి అఫైర్ ఉందా..? అందుకే ఛాన్స్ ఇచ్చాడా?