Naa Aata Soodu : ఒకప్పుడు టీవీ చానల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు చాలా అరుదుగా మాత్రమే వచ్చేవి. చాలా స్పెషల్ పండుగలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమాలను టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేసేవి. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పండుగ ను కూడా టెలివిజన్ ఛానల్స్ వాడుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సంక్రాంతి, ఉగాది, దసరా అని కాకుండా హోలీ శ్రీరామ నవమి ఇలా చిన్నచిన్న పండగలకి కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమాలలో ఈ టీవీ మల్లెమాల వారు ముందుంటున్నారు. మల్లెమాల జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్ ఈ ప్రత్యేక కార్యక్రమానికి రంగంలోకి దించుతున్నారు. చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైన.. చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఒకే ఎంటర్టైన్మెంట్ ని ఓ స్థాయిలో ఈటీవీ మల్లెమాల వారు ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో నెంబర్వన్ అనిపించుకుంటున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా ఫుల్ గా వాడేస్తున్న ఈటీవీ మల్లెమాల వారు ఇప్పుడు మరో అరుదైన కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.
ఏప్రిల్ 29వ తారీఖున అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం. ఇప్పటి వరకు ఏ టెలివిజన్ వారు కూడా ఆ ప్రత్యేక సందర్భాన్ని తీసుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కానీ ఈ టీవీ మల్లెమాల వారు మాత్రం ఆ ప్రత్యేక రోజుని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం భారీ ఎత్తున నా ఆట చూడు అనే డాన్స్ షో ని నిర్వహించారు. మే 1వ తారీకున ఆ షో టెలికాస్ట్ కాబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు. జబర్దస్త్ యాంకర్ రష్మీ మరియు ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఇంకా పలువురు ప్రముఖులు ఈ ఇంటర్నేషనల్ డాన్స్ డే ప్రత్యేక కార్యక్రమం లో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఢీ డాన్స్ కార్యక్రమం తో సందడి చేస్తున్న ఈటీవీ ఈ కార్యక్రమం తో మరింతగా డాన్స్ ప్రియులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also : Chiranjeevi : ‘ఆచార్య’ లో పవన్… చిరంజీవి వ్యాఖ్యలు వైరల్