Karthika Deepam july 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య, ఆనంద్ రావ్ లు భోజనానికి కూర్చోగా ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య,ఆనంద్ రావులు హిమ భోజనం చేయడానికి రమ్మని ఎంత బ్రతిమలాడినా కూడా తర్వాత తింటాను అని వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో సౌర్య నానమ్మ రమ్మని చెప్పు అని సౌందర్యకు చెప్పడంతో వెంటనే హిమ ఆనందంగా ఫీల్ అవుతూ భోజనం చేయడానికి వస్తుంది. అప్పుడు నా పక్కన కాదు నాకు ఎదురుగా నా కళ్లలోకి చూస్తూ తినమని చెప్పు అప్పుడు నాకు చేసిన ద్రోహం అని గుర్తుకు వస్తాయి అని అనడంతో హిమ తినకుండా బాధపడుతుంది.
మరొకవైపు నిరుపమ్, హిమ ఫోటో వైపు చూసి జరిగిన విషయాలను తలుచుకుని ఎందుకు హిమ ఇలా చేస్తున్నావు అని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు హిమ ఒంటరిగా కూర్చుని సౌర్యని తలచుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సౌందర్య ఆనంద్ రావ్ లు హిమ, సౌర్య ల గురించి ఆలోచిస్తూ చిన్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి తిరిగేవారు కానీ ఇప్పుడు ఇలా ఉండటం నాకు బాధగా ఉంది అని అనగా వెంటనే సౌందర్య కూడా అవును అంటూ వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది.
Karthika Deepam july 15 Today Episode : సౌర్యను చూసి హిమ అనుకుని ఐ లవ్ యు చెప్పిన నిరుపమ్..
ఆ తర్వాత సౌందర్య దంపతులు హిమ సౌర్యలను కలపడానికి ప్లాన్లు చేస్తారు. హిమ ఒంటరిగా కూర్చొని సౌర్య కోసం తాను చేసిన త్యాగాలు అన్నీ తనలో తానే మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సౌందర్య ఆనంద్ రావులు ప్లాన్లు వేసి హిమ, సౌర్య ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకొనేలా చేస్తారు. ఆ తర్వాత ప్రేమ్ తన సెల్ఫీ వీడియో గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
హిమని పెళ్లి చేసుకోవడానికి ఏదో ప్లాన్ వేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సౌందర్య వాళ్ళు ఇచ్చిన డ్రెస్సును వేసుకొని హిమ కిందికి వచ్చి ఏంటి విశేషం అని అడుగుతూ ఉండగానే ఇంతలో అక్కడికి సౌర్య కూడా సేమ్ అలాంటి డ్రస్సు వేసుకొని రావడంతో హిమ ఆశ్చర్య పోతుంది. అప్పుడు సౌర్య ఆనంద్ రావు దంపతులను ప్రశ్నిస్తూ ఏంటి ఇదంతా అంటూ హిమపై సీరియస్ అవుతుంది.
ఆ తరువాత హిమ, శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సౌందర్య ఆనందరావులు బాధపడుతూ ఉంటారు. మరొకవైపు స్వప్న నిరుపమ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో ప్రేమ్ వచ్చి నువ్వేమీ ఆలోచించకు ఈ పెళ్లి జరగదు అనడంతో స్వప్న సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత నిరుపమ్,హిమ మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి సౌర్య అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు నిరుపమ్, హిమ ని ఎంత పిలిచినా కూడా మాట్లాడకుండా పలకకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సౌర్య కోపంతో నేరుగా ఇంటికి వెళ్ళగా ఇప్పుడు సౌందర్య ఏంటి అప్పుడే వచ్చావు అని అడగగా వెటకారంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలోనే హిమ కూడా వచ్చి సౌందర్య వాళ్ళు ఏమి అడిగినా కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత సౌర్య హిమ పై కోపంతో హిమా ఫోటో వైపు బాణాలు విసురుతూ ఉండగా మధ్యలో హిమ అడ్డుపడి కోపం ఉంటే నా మీదకు విసిరే నన్ను చంపేయ్ అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, సౌర్యను చూసి హిమ అనుకుని ఐ లవ్ యు చెప్పి ఆ తర్వాత షాక్ అవుతాడు. ఆ తర్వాత హిమ ఎలా అయినా సౌర్య ని పెళ్లి చేసుకో బావా అని నిరుపమ్ ను బ్రతిమలాడుతూ ఉండగా ఆ మాటలు వింటుంది సౌర్య. ఆ తర్వాత హిమ నా కోసం నువ్వు ఇంతలా తాపత్రయ పడుతున్నావా అంటూ గట్టిగా కౌగిలించుకొని ఎమోషనల్ అవుతుంది సౌర్య.
Read Also : Karthika Deepam july 14 Today Episode : సౌందర్య, సౌర్య అంతు చూస్తాను అంటున్న శోభ.. ఆనందంలో హిమ..?