Sudigali Sudheer : తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాల్లో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి పూర్తిగా కల తప్పిపోయిందని చెప్పాలి.ఇప్పటికే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కాగా తాజాగా సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ఇక ఈ టీవీకి దూరమవుతున్న సుడిగాలి సుదీర్ స్టార్ మాకు దగ్గరవుతున్నారు. ఇలా సుధీర్ ఈటివి నుంచి స్టార్ మాకి వెళ్లడంతో సుధీర్ ను అడ్డుపెట్టుకొని ఇమాన్యుయేల్ రష్మీ పై పంచ్ లు వేశాడు.

తాజాగా వచ్చే వారం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఇమాన్యుయేల్ బాహుబలి స్కిట్ చేశారు. ఇందులో కట్టప్పగా ఇమాన్యుయేల్ సందడి చేయగా శివగామిగా రోహిణి సందడి చేశారు. ఇక శివగామి పాత్రలో ఉన్న రోహిణి వేదికపైకి వస్తూనే జడ్జి స్థానంలో ఉన్న సదాని చూపిస్తూ ఈమె ఎవరు కట్టప్ప అని ప్రశ్నిస్తుంది. ఆమె వెళ్లవయ్యా వెళ్ళు అనే రాజ్యానికి యువరాణి అని సమాధానం చెబుతాడు.
అదేవిధంగా యాంకర్ రష్మీని చూపిస్తూ ఈ మహారాణి ఎవరు అని రోహిణి అనగా వెంటనే ఇమాన్యుయేల్ చెలికత్తెని పట్టుకుని మహారాణి అంటున్నారు ఏంటమ్మా అని అంటారు. ఈమె ఎవరి కోసం ఎదురు చూస్తున్నది అంటూ రోహిణి అడగగా.. ఇమాన్యుయేల్ చెలికాడి కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడే వస్తానని చెప్పి పక్క రాజ్యానికి వెళ్లాడు అంటూ రష్మీ పై సెటైర్ వేశారు. అదే విధంగా సుధీర్ స్టార్ మాకి వెళ్లడంతో పరోక్షంగా ఈ విషయాన్ని కూడా ఇమాన్యుయేల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Read Also : Sudigali Sudheer : జబర్దస్త్ సుడిగాలి సుధీర్.. యాంకర్ సుధీర్ అయ్యాడు..!