Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఊరువాళ్ళతో అబద్ధం చెప్పించి దీపని అవమానిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఊరి ప్రజలు అందరూ రాజ్యలక్ష్మి ఇంటికి చేరుకోవడంతో ఆమె అందరికీ స్వాగతం పలికి అందరూ ఆడి పాడి సంతోషంగా ఉండండి అని చెబుతుంది. మరొకవైపు దీప బతుకమ్మను రెడీ చేస్తూ, అమ్మ నీ పేరే బతుకమ్మ నా బతుకు కూడా చల్లగా ఉండాలని దీవించు అని కోరుకుంటూ ఉంటుంది. మరొకవైపు కావేరి, మోనిత ఇద్దరూ బతుకమ్మను తీసుకొని వస్తూ ఉంటారు.
అప్పుడు కావేరి మన దెబ్బకు దీప పారిపోయింది అని మాట్లాడుతూ ఉండగా మోనిత మాత్రం అది అంత ఈజీగా పోయేది కాదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. మరొకవైపు సౌర్య ఇందాక నువ్వు పలకరించింది ఎవరిని బాబాయ్ అని అడగడంతో ఆరోజు ఆటోలో సరుకులు లిస్టు రాసింది అని చెప్పాను కదా అమ్మ ఆవిడే అని అనడంతో అప్పుడు సౌర్య నాకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ అంటూ ఎమోషనల్ అవుతుంది.
ఆరోజు మా అమ్మ చేతి రాత అని చెప్పాను ఇందాక హోటల్లో కూడా మా అమ్మలాగే అనిపించింది వెంటనే ఇంద్రమ్మ ఆరోజు మీ ఆంటీ ఎవరో దహన సంస్కారాలు చేసింది అన్నావు కదా అమ్మ అనగా ఏమో పిన్ని ఆమె ఎలాగో ఆ జాతరలో వస్తుంది కదా ఆ జాతరలోనే అమ్మను వెతుకుతా నువ్వు వెళ్దాం పదండి అని అంటుంది శౌర్య. మరొకవైపు దుర్గ ఆ ఊరికి చేరుకొని దీప కోసం వెతుకుతూ ఉండగా అంతలో దీప వాళ్ళ అన్నయ్య కనిపించి దుర్గకి దీప అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమని చెబుతాడు.
ఆ తర్వాత కార్తీక్,మోనిత ఎదురు నడుచుకుంటూ వస్తూ ఉండగా ఎందుకు కార్తీక్ అలా ఉన్నావు అని అనడంతో నాకు బోరింగ్ గా ఉంది మోనిత చుట్టూ ఎంత మంది ఉన్నా నేను ఒంటరిని అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు మోనిత అబద్ధాలు చెప్పి కార్తీక్ నచ్చ చెబుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దుర్గ వస్తాడు. అప్పుడు కార్తీక్, నువ్వేంటి అయ్యా ఇక్కడ అని అడగగా అదేంటి మునితా నువ్వు సార్ కి చెప్పలేదా అందరం కలిసే వెళ్దాం అని అన్నావు కదా అంటాడు దుర్గ.
అప్పుడు కార్తీక్ ఓహో అలా అనిందా అని అనడంతో లేదు కార్తీక్ నేను వాడిని పిలవలేదు అని అంటుంది. అప్పుడు దుర్గా నువ్వే కదా మోనిత మన ఊరికి వెళ్దాం జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుందాం అన్నావు కదా అని అంటాడు దుర్గ. ఇంతలోనే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి దుర్గని మాట్లాడించి ఏంటి దుర్గా ఇందాక మోనిత మ్మ ఒకటే కనిపించేసరికి నువ్వు రాలేదు అనుకున్నాను మొత్తానికి ఇద్దరు వచ్చేసారు అప్పట్లో మీరు కలిసి తిరిగేవారు కదా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
దాంతో వారి మాటలకు కోపంతో రగిలిపోయిన కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మోనిత ఏంట్రా ఇది అని దుర్గా అని అడగగా ఇప్పుడు అర్థమైందా మా దీపమ్మ బాధ ఏంటో అని అంటున్నాడు దుర్గ. అప్పుడు కార్తీక్ ని వెతుక్కుంటూ అక్కడికి వెళుతుంది మోనిత. అప్పుడు కార్తీక్ జరిగిన విషయాలన్నీ తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే సౌర్య వాళ్ళు కార్తీక్ పక్క నుంచి వెళ్తారు. అప్పుడు కార్తీక్ తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.
అప్పుడు శౌర్య దీప కోసం వెతుకుతూ ఉంటుంది. మరొకవైపు మోనిత, కావేరి వాళ్ళు రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తారు. దీప కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు ఊరు జనాలు దీప గురించి తప్పుగా మాట్లాడడంతో అప్పుడు రాజ్యలక్ష్మి అమ్మాయి గురించి నాకు తెలుసు మీరు ఎవరు తప్పులు పట్టకండి అని అంటుంది. అప్పుడు కావేరి మోనిత వెనకేస్తూ మాట్లాడడంతో అయినా ఈ అమ్మాయిది మన ఊరు అంటున్నావు కానీ ఇంతకుముందు ఎప్పుడు నేను ఈ ఊర్లో చూడలేదు అనటంతో ఆ మాటలు విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
అప్పుడు కార్తీక్ అంటే మోనిత అబద్ధాలు చెప్పి మనుషులను పెట్టి దీపని తిట్టించడానికి ఇలా చేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మోనిత అటు ఇటు చూసి కార్తీక్ ఈ మాటలు వినలేదు కదా అని అనుకుంటూ ఉండగా పక్కనే ఆ కార్తీక్ మాటలు వింటూ ఉండడంతో మోనిత అది చూసి షాక్ అవుతుంది.