Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రచారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార, జగతి మాట్లాడుతూ ఉండగా రిషి బయట నిలబడి వారి మాటలు వింటూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో జీవితం అనే బొమ్మల కొలువులో నేను ఒక దొషి గా నిలబడ్డాను వసు అలాంటిది ఆ జడ్జిమెంట్ కి నేను ఎలా తీర్పుని ఇవ్వగలను అని జగతి. సరే మేడం ఈ జ్యూస్ తాగండి అని వసుధర బలవంతంగా జ్యూస్ ని తాగిస్తుంది. అప్పుడు రిషి వారి మాటలను వింటూ ఉన్నాడు అని మహేంద్ర, వసు గమనిస్తారు.
అప్పుడు మేడం మీరు జ్యూస్ తాగుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి వసుధర బయటికి వెళ్లగా ఇప్పుడు రిషి మేడం కి ఎలా ఉంది వసుధర అని అనగా వెంటనే వసు డాక్టర్ శరీరానికి ట్రీట్మెంట్ చేశాడు కానీ మనసు కాదు కదా సార్ అని అనడంతో వెంటనే రిషి మేడంని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార లోపలికి వెళ్ళగా నువ్వు మీ మేడంని జాగ్రత్తగా చూసుకో వసు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మహేంద్ర రిషి దగ్గరికి వెళ్తాడు.
అప్పుడు మహేంద్ర ఏంటి రరిషి అన్ని మాటలు బయట ఉండి విన్నావా అని అంటాడు. అప్పుడు రిషి మేడం కి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించండి కావాలంటే స్పెషలిస్ట్ ని పిలిపించండి అని అనగా వెంటనే మహేంద్ర జగతికి కావాల్సింది బయట నుంచి తెప్పించే మందులు కాదు మానసిక ప్రశాంతత కావాలి అని అంటాడు. అప్పుడు మహేంద్ర మాటలకు రిషి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు ధరణి వంట చేస్తూ ఉండగా వసుధార అక్కడికి సహాయం చేయడానికి వెళుతుంది.
ఇంతలోనే అక్కడికి దేవయాని వచ్చి బలవంతంగా ధరణిని అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత వసు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా నేను మీతో కొంచెం మాట్లాడాలి అని దేవయాని అనటంతో నేను కొంచెం బిజీగా ఉన్నాను మేడం అని అంటుంది వసు. అంతా బిజీ పనులు ఏంటో అని అనగా అవన్నీ మీకు చెప్పాలని అంటుంది వసు.
దేవయాని నువ్వు ఇంత జరిగినా కూడా మళ్ళీ ఎలా వచ్చావు రిషిని వదిలిపెట్టవా అని అనగా జీవితాంతం వదిలిపెట్టను మేడం అని అనడంతో వెంటనే దేవయాని షాక్ అవుతుంది. తర్వాత రిషి అక్కడికి వచ్చి నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను గౌతమ్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు జగతి దంపతులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొకవైపు గౌతమ్, వసు ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు వారిద్దరు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు రిషి,వసుధార గురించి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్లిన వసుధార బొమ్మల కొలువు చేసి వాటితో మాట్లాడుకుంటూ ఉంటుంది. మరొకవైపు రిషి, వసు ఆలోచిస్తూ వసుధారకి మెసేజ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కాసేపు చాటింగ్ చేసుకుంటారు.
ఇక మరుసటి రోజు ఉదయం జగతి నిద్రపోతూ ఏంటి మహేంద్ర అప్పుడే కాఫీ తీసుకొని వచ్చావా అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి రిషి కాఫీ రావడం చూసి ఆశ్చర్య పోతుంది. ఇప్పుడు జగతి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రిషి జగతితో తన ప్రశాంతత గురించి మాట్లాడుతూ నేను మీకు కావాల్సిన ప్రశాంతతను ఇవ్వగలను కానీ మీరు నాకు కావాల్సిన బాల్యాన్ని తిరిగి ఇవ్వగలరా అంటూ ఏడుస్తూ మాట్లాడతాడు.
అప్పుడు రిషి మాటలు కూడా జగతి ఎమోషనల్ అవుతుంది. దయచేసి మీరు డాడ్ ఆనందాన్ని దూరం చేయొద్దని మేడం అని చెబుతాడు. ఇంతలోనే మహేంద్ర అక్కడికి రావడం చూసి జగతి షాక్ అవుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World