Karthika Deepam 23 Sep Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్య దగ్గర నోరు జారడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దీప ఎమోషనల్ అవుతూ కార్తీక్ కి తనను మరింత దూరం చేసింది ఆ మోనిత అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఉన్న వస్తువులన్నీ విసిరగొడుతూ బాధపడుతూ ఉండగా వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు అతను నువ్వు వెళ్లి నీ భర్తను తెచ్చుకో ఎవరు ఏమంటారు చూద్దాం అని అనగా నేను ఏది చెప్పినా నమ్మే పరిస్థితిలో ఆయన లేరు అని ఎమోషనల్ అవుతుంది దీప.

ఒకటే ఒక మార్గం ఉంది ఎలా అయినా కార్తీక్ ని ఇక్కడ తీసుకురావాలి అని అనడంతో తీసుకు వస్తాను అని అంటుంది దీప. మరొకవైపు మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. పొరపాటున ఆంటీ అంకుల్ ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే సౌందర్య వాళ్ళ కారు అక్కడికి రావడంతో మోనిత, శివుని పిలిచి కార్తీక్ ని పెరట్లోకి తీసుకుని వెళ్ళు అని అంటుంది.
అప్పుడు సౌందర్య దంపతులు అక్కడికి రావడంతో మోనిత ఏమీ తిరిగినట్టుగా నవ్వుతూ పలకరిస్తుంది. కానీ వాళ్లు చుట్టుపక్కల మొత్తం గమనిస్తూ ఉంటారు. అప్పుడు సౌందర్యాన్ని డాక్టర్ చదువు ఏమైంది అని అడగగా మోనిత కార్తీక్ తోడు లేడు కదా ఆంటీ ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకోలేను అందుకే వదిలేశాను అని అంటుంది. అప్పుడు దీప అక్కడికి రావడంతో మోనిత, దీపక్ వాళ్ళు కనిపించకుండా బట్టలతో కవర్ చేస్తుంది.
Karthika Deepam : గతం గుర్తుతెచ్చుకుంటున్న డాక్టర్ బాబు..?
అప్పుడు దీప ఎవరితో కష్టమర్లతో మాట్లాడుతున్నారు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్ ఫోన్ కోసం అని హాల్లోకి రావడంతో అక్కడే ఉన్న తన తల్లిదండ్రులను చూస్తాడు. అప్పుడు వారిని చూసి తన గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో శివా వచ్చి లాక్కొని వెళ్తాడు. అప్పుడు సౌందర్య దంపతులు మోనిత ఎందుకు కార్తీక్ అని గట్టిగా అరిచావు అని అడగగా మోనిత అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది.
అప్పుడు ఆనందరావు చూసి దీపలా ఉంది అనడంతో అదంతా మీ భ్రమ అంకుల్ అంటూ మోనిత అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది. అప్పుడు దీపా కార్తీక్ దగ్గరికి వెళ్లి నేను గుర్తుకు వచ్చాను డాక్టర్ బాబు అని అనగా నువ్వు కాదు ఎవరో మా ఇంటికి ఇద్దరు వచ్చారు వారిని చూసినప్పుడు నాకు ఏదో గుర్తుకు వచ్చింది అనడంతో వెంటనే దీప టెన్షన్తో అక్కడికి వెళ్ళగా అప్పుడు మౌనిక వారిని అక్కడి నుంచి పంపించేస్తుంది. అప్పుడు దీప అక్కడికి వచ్చి మోనిత మెడ పట్టుకొని ఎందుకు అలా చేశావు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇందాక ఎవరు వచ్చారు అని అడగగా మీ అత్త మామ అనడంతో దీప షాక్ అవుతుంది. దీంతో చూస్తాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది దీప.
Read Also : Karthika Deepam: మోనిత కు ఫోన్ చేసిన సౌందర్య..అడ్డంగా బుక్కైన మోనిత..?