Viral Video : కొన్ని పెళ్లిళ్లలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు కావాలని చేస్తారు. మరికొన్ని సార్లు అవి మనకు తెలియకుండానే జరిగిపోతాయి. అలాంటివి చాలా నవ్వు తెప్పిస్తాయి. అలాగే కలకాలం గుర్తుండి పోతాయి కూడా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి లాంటి శుభకార్యం వద్ద చేసే వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్ లు చేయడం, జోకులు చేయడం లాంటి వీడియోలు చాలా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. అయితే కొందరు మాత్రం తమ పెళ్లిని కూడా తమ ఫేమస్ కోసం వాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏదో ఒక వీడియోతో తాము సెలబ్రిటీలుగా మారాలని చాలా ఆశ పడుతున్నారు.
ఇక్కడ అలాంటి వీడియోనే ఒకటి ఉంది. అక్కడ పెళ్లి పీటలపై పెళ్లి తంతు నడుస్తోంది. పంతులు వరుడితో కార్యక్రమాలు చేయిస్తున్నాడు. వధువు వంతు వచ్చింది. అక్కడ ఉన్నవారంతా వధువు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వధువు మాత్రం ఓ గదిలో కూర్చుని మ్యాగీ తింటోంది. తనకు చాలా ఆకలిగా ఉందని చెబుతూ మ్యాగీ తింటోంది. పక్కన ఉన్న వారు త్వరగా తిను.. ఆలస్యం అవుతోంది అంటున్నారు. దానికి వధువు స్పందిస్తూ మ్యాగీ తినే సమయంలో ఎవరు డిస్టర్బ్ చేయవద్దు.. వరుడిని వెయిట్ చేయమని చెప్పండి అంటూ బదులిచ్చింది.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Viral Video: బైక్ పై తల్లి మృతదేహంతో 80కి.మీ. ప్రయాణం.. ఇంకెన్ని రోజులు ఈ అమానవీయం