Chanakya neeti : ఆచార్య చాణక్యుడు చెప్పన నీతి వ్యాఖ్యాలు మనిషి సుఖంగా, హాయిగా జీవించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన చెప్పిన విషయాలు పాటించడం వల్ల కచ్చితంగా విజయం సాధించ గలమని అందరి నమ్మకం. అయితే జీవిత భాగస్వామి ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. వాటి వల్ల జీవితం సాఫీగా సాగుతుందని వివరించారు. అయితే ఎలాంటి వాటిని ఆసరాగా తీసుకొని జీవిత భాగస్వామిని ఎంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న చిన్న రోగాలు ఏవైనా ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం వల్ల మిమ్మల్ని బాగా చూసుకుంటారని ఆచార్య చాణక్యుడు వివరించాడు. అతను ఎలాంటిదైనా సాధించడగలడని.. అలాగే సహనం లేని వ్యక్తిని అస్సలే పెళ్లి చేసుకోకూడదని వివరించారు. కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని వివరించాడు. ప్రశఆంత స్వభావులు ఉండే ఇంట్లో లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉంటుందని నమ్మకం.
మదురంగా మాట్లాడే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పారు. అలాంటి వారిని చేసుకోవడం వల్ల మనం ఏదైనా తప్పు చేసిని మెల్లిగా చెప్పి సర్దుకుపోతారని దీని ఉద్దేశం. అలాగే మతపరమైన ఆచారాలు పాటించే వ్యక్తిని వివాహం చేుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పాడు. ఎందుకంటే క్రమం తప్పకుండా పూజలు చేసే వ్యక్తి.. జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కుంటాడని వివరించారు.
Read Also : Chanakya neethi: అలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులంట.. అందులో మీరున్నారేమో చూస్కోండి!