Tulasi plant : తులసి మొక్కను హిందూమతంలో అత్యంత పవిత్రమైన, పూజనీయమైన మొక్కగా భావిస్తారు. పవిత్రమైన ఈ మొక్కలు ప్రజలు తమ ఇంట్లో నాటి నీరు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తులసి మొక్క కుటుంబంలోని అన్ని ఆపదలను దూరం చేస్తుందని విశ్వసిస్తారు. అలాంటి తులసి మొక్కకు సంబంధించిన 5 ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
- తులసి మొక్క 24 గంటలపాటు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్. దీనిని నాటిన చోట ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. పర్యావరణం శుభ్రంగా ఉంటుంది. ప్రతి రోజూ తులసి ఆకు రసాన్ని తాగితే చర్మవ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- గ్రహణానికి ముందు తులసి ఆకులను ఆహార పదార్థాలలో వేస్తారు. దీని వల్ల గ్రహణం ప్రభావం ఆహారంపై ఉండదని విశ్వాసం. ఆహారం స్వచ్ఛంగా ఉంటుంది. తులసిలో పాదరసం లాంటి రసాయనం ఉండటమే ఇందుకు కారణం. పాదరసంపై ఎలాంటి కిరణాల ప్రభావం ఉండదు.
- పురాణాల ప్రకారం తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులసి దలం లేకుండా శ్రీహరి ఆరాధన ఎప్పటికీ సంపూర్ణం కాదు. అంతేకాదు.. తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషాల ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు పరిఢవిల్లుతాయి.
- ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో పసుపు రంగుతో తులసి వేరును ఉంచితే ఆ ఇంటిపై పిడుగు ప్రభావం ఉండదని చెబుతారు.
- తులసిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. జలుబు, దగ్గు, దంత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. తులసి ఇతర వ్యాధుల సంక్రమణను నివారించడంలో అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Read Also : Vastu Tips : మీ వంట గదిలో ఈ చిట్కాలను పాటిస్తే… డబ్బుకు కొదువ ఉండదని తెలుసా ?
Tufan9 Telugu News And Updates Breaking News All over World