Karthika Deepam: మోనిత కు ఫోన్ చేసిన సౌందర్య..అడ్డంగా బుక్కైన మోనిత..?

deepa get emotional in todays karthika deepam serial episode
deepa get emotional in todays karthika deepam serial episode

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కావాలని దీప ను టెన్షన్ పెట్టాలి అని సరికొత్త ప్లాన్ వేస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని లెటర్ రాయడంతో అది చూసి ఆనందరావు ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అమ్మానాన్నల కు ఇచ్చిన మాట కోసం నేను సౌర్య దగ్గరే ఉంటాను తనని బాగా చూసుకుంటాను నాకోసం వెతకద్దండి అని రాస్తుంది హిమ. ఈ విషయం సౌందర్యకి తెలిస్తే ఇంకా ఎంత బాధ పడుతుందో అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఆనందరావు.

Advertisement

మరొకవైపు కార్తీక్, మోనిత ఇద్దరూ కార్లు వెళ్తుండగా వెనకాల దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఇద్దరూ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. గమనించిన మోనిత రా దీప అంటూ నవ్వుకుంటూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య కారులో వెళుతుండగా ఎంతలా ఆనందరావు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో సౌందర్య బాధపడుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి నేను ఇలా అయినా హిమను వెతికిపట్టుకొస్తాను అని అంటుంది.

Advertisement

మరొకవైపు కార్తీక్,మోనిత ఒక చోటకి వెళ్తారు. అక్కడ కార్తీక్ పేరు మీద ఒక బట్టల షాపు కూడా ఉంటుంది. ఆ పేరును చూసి దీప షాక్ అవుతుంది. ఇంతలోనే కొంతమంది అక్కడికి వచ్చి కార్తీక్,మోనిత లు ముందే తెలుసు అన్న విధంగా ప్రేమగా పలకరిస్తూ ఉండడంతో ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నో డౌట్ మోనిత నా భార్య అని అనుకుంటూ ఉంటాడు.

ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది అని దీప అక్కడికి వచ్చి అదంతా అబద్ధం అని అనడంతో అక్కడున్న మోనిత మనుషులు ఈ వంటలక్క ఇంకా నిన్ను విడిచి పెట్టలేదా కార్తీక్ బాబు అంటూ దీప పై లేనిపోని నిందలు వేస్తారు. దీప ని మొగుడు వదిలేశాడు అందుకే మీ వెంటపడుతుంది అంటూ కార్తీకి దీపం మీద లేనిపోని మాటలు అన్నీ చెబుతారు.

Advertisement

వారి మాటలకు దీప ఎమోషనల్ అవుతూ ఉండగా మోనిత కార్తీక్ ని తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సౌందర్య, ఆనందరావు దంపతులు పోలీసుల ద్వారా మోనిత ఫోన్ నెంబర్ తీసుకుని మోనిత కు ఫోన్ చేస్తారు. మరొకవైపు మోనిత కార్తీక్ తో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే సౌందర్య ఫోన్ చేస్తుంది.

అప్పుడు ఎవరు మాట్లాడేది అని అనగా నేను సౌందర్యాన్ని అని అనడంతో మోనిత పక్కనే ఉన్న కార్తీక్ అక్కడ ఉన్న బొమ్మను పడేగా జాగ్రత్త కార్తిక్ అని గట్టిగా అరుస్తుంది మోనిత. అప్పుడు సౌందర్య,మోనిత కార్తీక్ అంటున్నావ్ ఏమిటి అని అడగగా టెన్షన్ పడిన మోనిత వెంటనే ఫోన్ కట్ చేసి టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు సౌందర్య వాళ్ళు మోనిత మీద అనుమాన పడుతూ ఉంటారు. ఇక మోనిత టెన్షన్ పడటం చూసిన కార్తిక్ ఏమయింది అలా ఉన్నావు అని అడగగా ఏమీ లేదు అని నచ్చచెబుతుంది మోనిత. సౌందర్య ఆంటీ ఇక్కడికి వస్తుందేమో ఎలా అయినా నా అడ్రస్ కనుక్కుంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత.

Advertisement