Karthika Deepam 12 Sep Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్, డ్రైవర్ శివ సౌర్యకి పని అప్పచెప్పాడు అని అతన్ని కొడతాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్, మోనిత తో మనం ఆ అమ్మాయిని నిజంగానే ఇంతవరకు ఎప్పుడు చూడలేదా అని అనగా ఏ అమ్మాయి అని మోనిత అనడంతో అదే ఆ వినాయకుడు బొమ్మలు అమ్ముకునే అమ్మాయి అని కార్తీక్ అనగా వెంటనే మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయిని నాకు ఎక్కడో చూసినట్టు గుర్తుగా ఉంది అని కార్తీక్ అనడంతో మోనిత లేదు అంటూ అబద్ధం చెబుతూ ఉంటుంది.

అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచించకు ముందు ఆ బొమ్మలను ఏం చేయాలో అది ఆలోచించు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది మోనిత. అప్పుడు కార్తీక్ మాత్రం పదేపదే శౌర్య గురించే మాట్లాడుతూ ఉండగా మోనిత, కార్తీక్ పై సీరియస్ అవుతుంది. అప్పుడు కార్తీక్,వంటలక్కని పూజకు పిలిచావా అని అడుగగా పిలిచాను కానీ రాను అని చెప్పింది కార్తీక్ అంటుంది మోనిత.
మరొకవైపు దీప ఇంట్లో పూజ చేస్తూ తన బాధ దేవుడితో చెప్పుకుంటూ ఉంటుంది. మోనిత ఇంట్లో కూడా దేవుని పూజ చేస్తూ ఉంటారు. మరొకవైపు కార్తీక్ పంచె ఎలా కట్టు కోవాలో తెలియక మూలితను హెల్ప్ గా మోనిత కూడా కట్టడం రాదు. అది చూసిన దీప బాధతో బయటికి వెళ్లి డ్రైవర్ శివ ని లోపలికి పంపిస్తుంది.
లోపల మోనిత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు విని బయట దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి కార్తీక్ వచ్చి ఏమైంది వంటలక్క ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్న వంటలక్క నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కానీ గతం గుర్తుకు రావడం లేదు అనడంతో దీప మరింత బాధపడుతుంది.
Karthika Deepam 12 Sep Today Episode : మోనితపై మండిపడ్డ కార్తీక్.. సంతోషంలో దీప..?
ఇప్పుడు కార్తీక్ చెప్పు వంటలక్క అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే మోనిత అక్కడికి వస్తుంది. లోపల కోపాన్ని పెట్టుకొని బయటికి మాత్రం నవ్వుతూ వంటలక్క అంటూ ప్రేమగా మాట్లాడిస్తుంది. తర్వాత పూజారి పిలవడంతో లోపలికి వెళ్తారు. అప్పుడు పూజారి దంపతులిద్దరూ కలిసి పూజలో కూర్చొని చెప్పగా అప్పుడు వెంటనే వంటలక్క డాక్టర్ బాబు ఒక్క నిమిషం మీరు నాకు ఒక మాట ఇచ్చారు.
అప్పుడు నేను మాట ఇచ్చాను అంటూ కార్తీక్ ఆశ్చర్యంగా అడగగా, మీకు గుర్తుండదని నాకు తెలుసు డాక్టర్ బాబు అందుకే పేపర్ లో రాసి జేబులో పెట్టాను అనగా కార్తీక్ అప్పుడు ఆ పేపర్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్తాడు. అప్పుడు మోనిత కోపంతో ఏ మాట ఇచ్చాడే అని అనగా వెంటనే దీప నాకు షాక్ ఇవ్వాలని పూజకు పిలిపించావు కానీ ఇప్పుడు నేను నీకు షాక్ ఇస్తాను అని అంటుంది.
ఇంతలో కార్తీక్ ఆ పేపర్ తీసుకుని వచ్చి పూజలో నేనే కూర్చోవాలి ఒక్కడినే పూజ చేయాలి అనడంతో ఆ మాటలకు మోనిత షాక్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక్కడివే పూజలో కూర్చోవడం ఏంటి కార్తీక్ అంటూ నానా గొడవ చేస్తుంది. అప్పుడు కార్తీక్ నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటాను మోనిత అంటాడు. అప్పుడు దీప, నాతో చెప్పిన మాటలు కార్తీక్ చెప్పడంతో పూజారి దీప ను పొగుడుతాడు.
మోనిత మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు దీప,కార్తీక్ కి గతం గుర్తుతెచ్చే ప్రయత్నం చేస్తుండగా మోనిత అడ్డుపడడంతో పూజారి మోనీత పై కోప్పడతాడు. అప్పుడు దీప మాటలకు కార్తీక్ మెల్లమెల్లగా ఆలోచిస్తూ గతం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మోనిత మాత్రం టెన్షన్ పడుతూ కనిపిస్తుంది.
అప్పుడు వెంటనే మోనిత చాలు అంటూ కార్తీక్ ఆలోచన నుంచి చెడగొట్టి ఇంతకుముందు అలాంటివి ఏమీ జరగలేదు అంటూ కార్తీక్ ఆలోచనలను డైవర్ట్ చేస్తుంది. దాంతో దీప కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ పూజల కూర్చోగా దీప,మోనితకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు పూజ పూర్తి అవడంతో వంటలక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మోనిత నువ్వు దాని ఇంటికి ఎప్పుడు వెళ్లావు అని అనడంతో కార్తీక్ జరిగింది మొత్తం వివరిస్తూ ఉంటాడు.
Read Also : Karthika Deepam September 10 Today Episode : మోనితకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన దీప.. సంతోషంలో శౌర్య..?