...

Chinmayi: సమంతతో చిన్మయి ప్రయాణం ముగిసిందట.. ఇక డబ్బింగ్ చెప్పదా!

Chinmayi: ఏమాయ చేశావే సినిమాతో సమంత తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన మొదటి చిత్రంలో ఆమె పోషించిన జెస్సీ పాత్ర అందరికీ గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం ఆమె వాయిస్. అయితే స్క్రీన్ పై సామ్ కనిపించినా ఆ వాయిస్ మాత్రం చిన్మయి శ్రీపాదదే. ఆ తర్వాత సామ్ చేసిన ఎన్నో సినిమాలకు ఈమె డబ్బింగ్ చెప్పారు. ఎంతో పేరు తెచ్చుకున్నారు.

Advertisement

Advertisement

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి శ్రీపాద.. ఇక సామ్ తో తన ప్రయాణం ముగిసిందని చెప్పింది. అది కేవలం కెరియర్ పరంగా మాత్రమేనని కూడా వివరించింది. అయితే తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకు గుర్తింపు వచ్చిందంటే అది కేవలం సమంత వల్లేనని.. ప్రస్తుతం తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుందని చిన్మయి చెప్పుకొచ్చింది.

Advertisement

సామ్ పాత్రలకు ఆమే డబ్బింగ్ చెప్పుకోవడం తనకు సంతోషాన్ని ఇస్తుందని కూడా వివరించింది. అయితే కెరియర్ పరంగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ.. స్నేహితులుగా జీవితాంతం కలిసుంటామంది. తన భర్త రాహుల్, సామ్ మంచి స్నేహితులని.. వీలయినప్పుడల్లా తాము ఇంట్లోనే కలుసుకుంటామని వివవించింది.

Advertisement
Advertisement