Venumadhav: కమెడియన్ వేణు మాధవ్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. వందల సినిమాల్లో నటింటి వేలాది మందిని కడుపుబ్బా నవ్వించిన ఆయన అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. అయితే అనుకోకుండా ఆయన 2019వ సంవత్సరంలో చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణం తర్వాత చాలా రకాల వార్తలు వచ్చాయి. ఆయన చావుకు కారణం ఇదేనంటూ వందల్లో వార్తలు పుట్టుకొచ్చాయి.
అయితే తాజాగా ఆయన భార్య శ్రీవాణి, కుమారులు సావికర్, ప్రభాకర్ లు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. వేణు మాధవ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆయన మరణంపై వచ్చిన వార్తలు తమను చాలా బాధపెట్టాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తమ కుమారులు తమ తండ్రి వేణు మాధవ్ అని చెప్పుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపేవాళ్లు కాదని అన్నారు. ఎందుకంటే తమ తండ్రికి ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని వివరించారు.
ఆయన కుమారులం అని చెప్తే.. అంతా అతడిని పరిచయం చేయమని అడిగే వాళ్లని అందుకే బడిలో కూడా వాళ్ల నాన్న గురించి పెద్దగా చెప్పకపోయే వాళ్లమని చెప్పుకొచ్చారు. తమతో వేణు మాధవ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడని.. ఆయన లేని లోటు చాలా బాగా తెలుస్తుందంటూ కామెంట్లు చేశారు.