Telugu NewsLatestPetrol Prices Today : స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Petrol Prices Today : స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Petrol Prices Today : మన దేశంలో దాదాపు నెల రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. అయితే ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

Advertisement
Petrol Prices Today
Petrol Prices Today
  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.
  • గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.
  • Read Also :PM KISAN : రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 11 వ ఇన్స్టాల్ మెంట్ కు వారు మాత్రమే అర్హులు..?

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు