Solar Eclipse :సూర్య గ్రహణం రోజున కొన్ని కొన్ని పనులు చేయకూడదు అంటారు. అలాగే కొందరు కొన్ని పనులు చేయడం ద్వారా లాభం చేకూరుతుందని చెబుతారు. అయితే ఈ ఏడాదిలో మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న వస్తోంది. శనివారం మధ్యాహ్నం 12:15 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 04:07 గంటల వరకు సూర్యగ్రహం ఉంటుంది. సూర్య గ్రహణం ఏర్పడిన తర్వాత… అంటే మే 1వ తేదీ ఉదయం సూర్య గ్రహణం తొలగిపోయిన తర్వాత రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతారు. ఇంట్లో ధనధాన్యాలు వృద్ది చెందుతాయి. మే 1వ తేదీన ఉదయం సూర్య గ్రహణం తొలగిపోయిన తర్వాత తల స్నానం చేయాలి. రాశిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో వస్తువును దానం చేయాలి. ఇలా చేస్తే గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి.
మేషం: ధాన్యాలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పు తదితరాలను దానం చేయాలి. వృషభం : పాలు, పెరుగు, ఖీర్, పంచదార, అన్నం, తెల్లని వస్త్రాలు, కర్పూరం దానం చేయాలి. మిథునం : ఆవుకు పచ్చి గడ్డి తినిపించాలి. ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ బట్టలు, ఆకుపచ్చ పప్పు, కంచు పాత్రలు మొదలైనవి కూడా దానం చేయవచ్చు. కర్కాటకం: వీరు బ్రాహ్మణుడికి ముత్యాలు, తెల్లని వస్త్రాలు, పంచదార, అన్నం, పాలు లేదా పాలతో చేసిన స్వీట్లను దానం చేయాలి. సింహం : బ్రాహ్మణుడికి గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు మొదలైన వాటిని దానం చేయాలి.
కన్య: పచ్చి మేత, పచ్చి వెన్నెల పప్పు, పచ్చి వస్త్రాలు, పచ్చి కూరగాయలు మొదలైన వాటిని దానం చేయాలి. తుల: తెల్లటి వస్తువులను దానం చేయాలి. వృశ్చికం: ధాన్యాలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పు తదితరాలను దానం చేయాలి. ధనుస్సు : పప్పు, శనగపిండి, బెల్లం, పసుపు, కుంకుమ దానం చేయాలి. కుంభం: గొడుగు, దువ్వెన, నలుపు లేదా నీలం రంగు బట్టలు, ఆవాల నూనె, నువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి. మకరం: గొడుగు, దువ్వెన, నలుపు లేదా నీలం రంగు బట్టలు, ఆవాల నూనె, నువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి. మీనం : బెల్లం, శనగపప్పు, పసుపు వస్త్రాలు తదితరాలను దానం చేయాలి.
Read Also :Astrology tips: చేపట్టిన ప్రతి పనీ ఆగిపోతుందా.. అయితే ఇలా చేయండి!