Astrology tips : ఒక్కో సారి మనం చేసే చిన్న చిన్న పనులూ కూడా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా వాస్తు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వస్తువును కొద్దిగా పక్కకు జరపడం వల్ల కూడా చాలా ప్రభావం పడుతుంది. అది ప్రయోజనకరంగా ఉండవచ్చు. లేదా శాస్త్రానికి వ్యతిరేకంగా వస్తువును పెడితే నెగెటివ్ ప్రభావం కూడా ఉండవచ్చు. ఎండు మిర్చితో ఎన్నో రకాల నివారణలను చేయవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నివారణలు జీవితంలోని అనేక సమస్యలను అధిగమించడానికి ఉపకరిస్తాయి. ఇలా నివారణలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇలా ఎండు మిర్చితో పలు నివారణలు చేయడం ద్వారా పలు శారీరక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.
చేపట్టిన పనిలో అడ్డంకులు ఏర్పడితే మనం అనుకున్న ఫలితం రాదు. మానసిక ప్రశాంతత కూడా పోతుంది. దీనిని నివారించుకునేందుకు ఎండు మిర్చితో ఇలా చేయాలి. 21 మిరపకాయలను తీసుకుని వాటిని నీటిలో వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా వరుసగా 21 రోజులు చేయాలి. అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో ‘ఓం తుష్టాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఏడు ఎర్ర మిరపకాయలను రుమాలులో కట్టి దగ్గరే ఉంచుకోవాలి. ఎక్కడికి వెళ్లినా వాటిని కూడా తీసుకువెళ్లాలి. వారం కాగానే ఈ మిరపకాయలను తీసి వేసి కొత్త వాటిని పెట్టుకోవాలి. ఏదైనా పనిలో వచ్చే అడ్డంకులైనా లేదా వివాహంలో వచ్చే అడ్డంకులనైనా తొలగించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
Read AlsoTirupati: వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి.. ఈ ముడుపు ఎప్పుడు కట్టాలో తెలుసా? :