...

Hyderabadi haleem : హలీమ్.. ఒక్కసారి తిని చూడండి.. మళ్లీ తినకుండా ఉండలేరు!

Hyderabadi haleem : హలీమ్.. ప్రత్యేకంగా రంజాన్ సీజన్ లో దొరికే ఈ వంటకం అంటే చాలా మంది ఇష్టపడతారు. రంజాన్ మాసం ఆరంభం అయ్యాక విధి విధికి, గల్లీ గల్లీకి ఒక హలీమ్ దుకాణం వెలుస్తుంది. ప్రతి దుకాణం వద్దా ఎప్పుడు జనాలు కనిపిస్తూనే ఉంటారు. ఈ వంటకాన్ని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. హలీమ్‌ ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే దీని పేరు వింటే చాలు చాలా మందికి నోరూరుతుంది. అలాగే ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అసలు హలీమ్ అంటే.. మటన్‌తో చేసే వంటకం. కానీ ఇప్పుడు చికెన్‌తో కూడా చేస్తున్నారు. శాఖాహారుల కోసం వెజిటెబుల్ హలీమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎన్ని వచ్చినా.. మటన్ హలీమ్‌ తింటేనే.. దాని అసలైన రుచిని ఆస్వాదించగలం.

Hyderabadi haleem
Hyderabadi haleem

మొఘల్ చక్రవర్తుల కాలంలో మన దేశంలోకి వచ్చిన హలీమ్‌ వంటకాన్ని హైదరాబాద్‌ తన సొంతం చేసుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. చరిత్రకారులు ఎవరైనా హలీమ్ పుట్టినిల్లుగా హైదరాబాద్‌నే చెబుతారు. హలీమ్ వంటకం మొఘలుల నుండి వచ్చినా.. దానిని పెద్ద పీట వేసింది మాత్రం నిజాం ప్రభువులే అని చెప్పాలి. హలీమ్ పూర్తిగా మటన్‌తో చేసే వంటకం కావడంతో ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే హలీమ్‌ను శక్తివంతమైన పదార్థంగా గుర్తించారు. హలీమ్ రుచిగా కూడా ఉండటంతో నిజామ ప్రభువులు ప్రీతిపాత్రంగా భావించారు.

అప్పటి నుండి హలీమ్ తన రూపును కొద్ది కొద్దిగా మార్చుకుంటూ వచ్చింది. హైదరాబాద్‌లో దొరికే ప్రత్యేక మసాలా దినుసులు జోడించడంతో పక్కా లోకల్ ఫ్లేవర్ దానికి యాడ్ అయింది. దీంతో హలీమ్ చాలా మందికి నచ్చడం మొదలైంది. ఒకప్పుడు ప్రభువులకే పరిమితమైన ఈ వంటకం… ఇప్పుడు సాధారణ ప్రజలకూ చేరువైంది. హైదరాబాద్‌లో తయారు చేసే హలీమ్‌లో మన దగ్గర దొరికే మసాలా దినుసులను ఎక్కువగా వాడతారు. దీంతో హలీమ్‌ మంచి రుచిగా తయారైంది. ప్రస్తుతం హైదరాబాదీ హలీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉంది. ఇక్కడ తయారయ్యే హలీమ్‌.. మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా దేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అక్కడి వారు మన హలీమ్‌ను ఎంతో ఇష్టపడి తింటారు.

Read Also :Temple Pulihora : నోరూరించే పులిహోర.. అచ్చం గుడిలో తయారుచేసినట్టే చేయొచ్చు.. ఇలా ట్రై చేయండి..!