Guppedantha Manasu: తెలుగు బుల్లీతెర పై ప్రసారమవుతున్న గుప్పడంతా మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జగతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు చక్రపాణి.
ఈరోజు ఎపిసోడ్ లో చక్రపాణి జగతితో ఫోన్ మాట్లాడుతూ నా కూతురు గొంతు కోస్తున్నావా అనడంతో నాన్న వసుధార మర్యాదగా మాట్లాడండి అనడంతో వెంటనే సీరియస్ అవుతాడు చక్రపాణి. అప్పుడు వెంటనే జగతి చక్రపాణి గారు మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడండి రిషి నాకన్న కొడుకు అన్నంతో అయితే ఈ పెళ్ళికి నేను అసలు ఒప్పుకోను అని అంటాడు. అమ్మ టీచరమ్మ నీ బాధపాదాలు ఎక్కడున్నాయో చెప్పు నీ పాదాలకు నమస్కారం చేస్తాను నన్ను నా కూతురిని నా ఫ్యామిలీని వదిలిపెట్టు అని ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి.
అప్పుడు నాన్న మొబైల్ ఇవ్వండి. నా పెళ్లి నా ఇష్టం అని వసుధార అనడంతో వెంటనే చక్రపాణి అవునా నీ పెళ్లి నీ ఇష్టమా అని చెప్పి వసుధార చేతిలో మొబైల్ లాక్కొని గదిలో వేసి బంధిస్తాడు. అప్పుడు గది తలుపు బయట తాళం వేసి ఇంతలోనే ఒక వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి అందులో విషయం కలిపి నువ్వు ఆ రూమ్ తాళాలు తెరిచావు అంటే ఈ విషయం తాగి చచ్చిపోతాను అని సుమిత్రను బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తాడు.. ఆ తర్వాత రాజీవ్ చక్రపాణి తో ఫోన్ మాట్లాడుతూ మీకు అన్ని విషయాలు నేను తోడుగా ఉంటాను మామయ్య అంటూ దొంగ ప్రేమలు కురిపిస్తూ మాట్లాడుతూ ఉండడంతో చక్రపాణి కూడా మొత్తం నీదే అల్లుడు అని అంటాడు.
నేను అన్ని చూసుకుంటాను మీరేం భయపడకండి మామయ్య అని ఫోన్ కట్ చేస్తాడు రాజు. మరొకవైపు జగతి జరిగిన విషయాలు మహేంద్రతో చెప్పడంతో మరి ఎలా జగతి ఈ విషయం రిషికి చెబుదామా అని అంటాడు. వద్దు మహేంద్ర పొరపాటున వేసి ఏదైనా కోపంతో అంటే వారి బంధంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మనం వెళ్దాము అనగా అదేంటి జగతి అనడంతో మనకు ఇది తప్ప మరొక మార్గం లేదు మహేంద్ర తొందరగా వెళ్దాం పద అని మాట్లాడుతూ ఉంటుంది జగతి. ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి వారి మాటలు విని ఇలా ప్లాన్ చేస్తున్నావా జగతి నేను అక్కడికి వచ్చిన రాకపోయినా అక్కడ పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగానే జరుగుతాయి అనుకొని పక్కకు వెళ్లి రాజీవ్ కి ఫోన్ చేస్తుంది.
అప్పుడు రాజీవ్ చెప్పండి మేడం జి అనడంతో రిషి వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు అక్కడికి వస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి అని అంటుంది. దేవయాని కంట పడకుండా బయలుదేరాలి అని దొంగ చాటుగా వెళుతుండగా ఇంతలోనే జగతి మహేంద్రలను దేవయాని అడ్డుకొని ఎక్కడికి వెళ్తున్నారు మహేంద్ర అనగా పెళ్లికి సంబంధించిన సామాగ్రి తీసుకొని రావడానికి వెళ్తున్నాము అని మహేంద్ర అనడంతో ఏమీ తెలియనట్టుగా సరే వెళ్ళండి మహేంద్ర అని అంటుంది దేవయాని. మరొకవైపు వసుధార అమ్మ గది తలుపులు తెరువు కనీసం ఆ మొబైల్ ఫోన్ అయినా ఇవ్వమ్మా అనడంతో నేనేమి చేయలేని వసుధార అని ఏడుస్తూ ఉండగా నాన్న మాటలు నమ్మొద్దమ్మా ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
నువ్వు నమ్మొద్దు అని అనగా నేను ఏం చేయలేను అని అంటుంది. ఇంతలోనే పెళ్లికి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వస్తాడు చక్రపాణి. అవి చూసిన వసుధార షాక్ అవుతుంది. అన్న మీరు ఒకసారి చెప్తే అర్థం కాదా తలుపులు తీయండి అనడంతో ఏ వసుధార నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చింది అంటే నేను విషయం తాగి చచ్చిపోతాను అని బెదిరిస్తాడు. అప్పుడు సుమిత్ర మాట్లాడడంతో నీకు కూడా చెప్తున్నాను సుమిత్ర మాట్లాడవంటే చచ్చిపోతాను అని బెదిరిస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం సుమిత్ర అలాగే ఏడ్చుకుంటూ కూర్చుండగా చక్రపాణి పెళ్లి పందిరి వేసి చుట్టూ తోరణాలు కట్టి పూలు డెకరేషన్ చేస్తూ ఉంటాడు.
ఇంతలో అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ ఏం జరుగుతుందమ్మా నాన్న ఆ పనులు ఆపు నాన్న అని అనడంతో వెంటనే చక్రపాణి సుమిత్ర దగ్గరికి వెళ్లి నేను ఒక్కడినే కష్టపడుతున్నాను వచ్చి నాకు సహాయం చేయి సుమిత్ర అని అంటాడు. ఇంతలోనే రిషి వసుధార కి ఫోన్ చేస్తాడు. అప్పుడు చక్రపాణి సుమిత్ర ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చెయ్ అని అంటాడు. ఇప్పుడు రిషి వసుధార అసలు ఏం జరుగుతుంది మీ బావ వచ్చి నాకేదో నీ పెళ్లి అని చెబుతున్నాడు నాకు అర్థం కావడం లేదు నువ్వు వద్దు అన్నావు కానీ నేను ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
ఆ తర్వాత ఆలోచనలో పడతాడు చక్రపాణి. ఇంతలోనే పూజారిని తీసుకుని ఇంటికి వస్తాడు రాజీవ్. అప్పుడు రాజీవ్ ని చూసి వసుధార షాక్ అవుతుంది. పెళ్లి అన్నారు ఇక్కడ ఎవరూ లేరు కదా బాబు అనడంతో ఇది అనుకోకుండా జరుగుతున్న పెళ్లి పంతులుగారు అవన్నీ మీకు అనవసరం వచ్చిన తంతు జరిపించండి.