B.Tech Chaiwali : చదువులమ్మ.. బీటెక్ చాయ్ వాలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి.. ఈమె రియల్ స్టోరీ చదవాల్సిందే..!

Btech student chaiwala special story
Btech student chaiwala special story

B.Tech Chaiwali : చదువు కేవలం పెద్ద పెద్ద ఉద్యోగాలు మాత్రమే చేయడానికి కాదు, తమకు నచ్చిన రంగంలోకి వెళ్లి కళలను సాకారం చేసుకోవచ్చని నిరూపించింది ఓ అమ్మాయి. సొంతంగా బీటెక్ చాయ్ వాలీ అనే పేరుతో ఓ అమ్మాయి టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఓ టీ షాప్ ప్రారంభించింది.

Advertisement

సదరు షాప్ కు బీటెక్ చాయ్ వాలీ అనే పేరు పెట్టింది. దీంతో వ్యాపారం ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే వర్తికా సింగ్ మాట్లాడుతూ.. సొంతంగా వ్యాపారం చేయాలనుకోవడం నాడ్రీమ్. అందులో భాగంగానే ఫరీదాబాద్ లోని గ్రీన్ ఫీల్డ్ వద్ద బీటెక్ చాయ్ వాలీని ప్రారంభించాను. ప్రతీరోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరు టీ షాప్ నడుపుతున్నాను. బీటెక్ చాయ్ వాలీతో చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial)

Advertisement

మరోవైపు గ్రీన్ ఫీల్డ్ ప్రాంతంలో బీటెక్ చాయ్ వాలీ ఎంతో ఫేమస్ అయింది. ఈ షాప్ లో మసాలా టీ తాగేందుకు కస్టమర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు వివరించింది. కాగా బీటెక్ చాయ్ వాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.

Advertisement

Advertisement

Read Also : Father Worship : తండ్రి ప్రేమంటే ఇదే.. పుత్తడి బొమ్మలాంటి కూతురికి గుడికట్టిన తండ్రి.. నిత్యం పూజలు చేస్తున్నాడు..!

Advertisement