Bimbisara Movie Review : నందమూరి కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ‘బింబిసార’ అనే సోషియో-ఫాంటసీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 5న 2022 (శుక్రవారం) బింబిసారగా థియేటర్లలో రిలీజ్ అయింది. గతంలో కళ్యాణ్ రామ్ ఇలాంటి మూవీ చేయకపోవడంతో బింబిసారపై భారీ అంచనాలు పెరిగాయి. కల్యాణ్ రామ్ పడిన కష్టాన్ని తెలుగు ప్రేక్షకులు సహా విమర్శకులు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇంతకీ బింబిసారగా కళ్యాణ్ రామ్ ఎంతవరకు మెప్పించాడు అనేది తెలియాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్లిపోదాం రండి..
బింబిసార టైమ్ ట్రావెల్ మూవీ.. ఒకే సమయంలో రెండు టైమ్‌లైన్‌లలో సాగుతుంది. క్రీస్తు పూర్వం 500ఏళ్ల నాటి త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసార (Bimbisara Movie Review) గొప్ప చక్రవర్తి (కళ్యాణ్ రామ్) పాలిస్తుంటాడు. తనను తాను దేవుడిగా, రాక్షసుడిగా ప్రకటించుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలనే తన కోరిక నెరవేర్చుకునేందుకు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అయితే తనకు మరో ప్రపంచంలో తనలాంటి మరో వ్యక్తి బింబిసారుడిలా కనిపిస్తాడు. ఆ ప్రపంచంలో అతన్ని ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడే అతడికి తన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. కొన్ని వేల ఏళ్ల నాటి బింబిసార నిధిని తెరవగల సమర్థుడు తాను ఒక్కడేనని గ్రహిస్తాడు. ఒకే ఫ్రేమ్‌లో రెండు టైమ్ ట్రావెల్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు వశిష్ట.. ఈ రెండు టైమ్ ఫ్రేమ్ ఒకే సమయంలో తలపడితే ఏమి జరుగుతుందనేది అసలు స్టోరీ..
నటీనటులు వీరే :
నందమూరి కళ్యాణ్‌రామ్, సంయుక్తా మీనన్, కేథరిన్ థ్రెసా, వెన్నెల, వారినా హుస్సేన్, ప్రకాష్ రాజ్ నటించారు. ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రఫీ ఛోటా కె. నాయుడు అద్భుతంగా చూపించాడు. ఇక మూవీ మ్యూజిక్ M. M. కీరవాణి తనదైన మ్యూజిక్ అందించి అబ్బురపరిచారు. ఎడిటర్‌గా తమ్మి రాజు బాధ్యతలు నిర్వర్తించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కె ఈ మూవీని నిర్మించింది.
Movie Name : | Bimbisara (2022) |
Director : | మల్లిడి వశిస్ట్ |
Cast : | నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెసా |
Producers : | హరికృష్ణ కె |
Music : | ఎమ్.ఎమ్ కీరవాణి |
Release Date : | 5 ఆగస్టు 2022 |
అసలు స్టోరీ ఇదే :
నందమూరి ఫ్యామిలీకి సోషల్ ఫాంటసీ మూవీలు కొత్తేమి కాదు. అందులోనూ తెలుగు ప్రేక్షకులు అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి జానపద నేపథ్యంలో వచ్చిన మూవీలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో బాహుబలి వంటి మూవీలను చేస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ కూడా ఈ తరహా సోషియో ఫాంటసీ మూవీలను తెలుగు ప్రేక్షకులు చూసేందుకు ఇష్ట పడుతున్నారు. బింబిసారా మూవీ (Bimbisara Review)లో స్పెషల్ హైలట్..
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్.. ఇదే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్.. రెండు టైమ్‌లైన్‌లతో సంబంధం లేనప్పటికీ దర్శకుడు వశిష్ట మాత్రం అద్భుతంగా ఆడియోన్స్ కనెక్ట్ అయ్యేలా చేసే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ సాలిడ్ యాక్షన్ బ్లాక్‌తో మొదలై.. బింబిసారను ప్రేక్షకులకు చూపిస్తుంది. అందులోనే బింబిసార ఎంత క్రూరుడు అనేది కూడా చూపించాడు దర్శకుడు. అయితే దానికి అర్ధ గంట సన్నివేశాలను సాగాదీసినట్టుగా కనిపించింది.
Bimbisara Movie Review : బింబిసార మూవీలో కొత్త కళ్యాణ్ రామ్‌ను చూస్తారు.. సినిమా ఎలా ఉందంటే..?
బింబిసార ఫస్ట్ హాఫ్ కళ్యాణ్ రామ్ నటనతో యాక్షన్ సీన్లతో అద్భుతంగా చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. బింబిసారను పోలిన వ్యక్తిలోకి బింబిసారా ఆవహిస్తాడు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులని అలరిస్తాడు. బింబిసార మూవీలో ప్రత్యేకించి స్టోరీ లైన్ లేదు. ఈ మూవీలో రెండు టైమ్ ట్రావెల్లో కళ్యాణ్ రామ్ నెగెటివ్ షేడ్స్ ఆసక్తిని కలిగిస్తాయి. ఈ మూవీలో లోపాలు చెప్పాలంటే.. లవ్ స్టోరీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్ని సాంగ్స్ అవసరం లేని చోట జొప్పించినట్టుగా కనిపించింది. లాజిక్‌లు కూడా మిస్ అయ్యాయి. ఎన్ని లోపాలు ఉన్న కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ మనవడిగా తనదైన విశ్వరూపాన్ని చూపించాడు.
కళ్యాణ్ రామ్ డ్యుయల్ రోల్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్. బింబిసారలో విశ్వానందన్ వర్మ (ప్రకాష్ రాజ్) రోల్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి కథను ఎన్నుకుని కళ్యాణ్ రామ్ హీరోగా పెద్ద సాహసమే చేశాడు. ఏదిఏమైనా కళ్యాణ్ రామ్ నటనే ఈ మూవీని ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందని చెప్పవచ్చు. సాంకేతికంగా బింబిసార అద్భుతంగా ఉంది. ఇక చోటా కె నాయుడు విజువల్స్ పిచ్చెక్కించాడు. M.M. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తన మ్యాజిక్ చూపించాడు. మొత్తం మీద బింబిసార మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే ఒక సోషియో ఫాంటసీ మూవీ.. కళ్యాణ్ రామ్ నటన విశ్వరూపాన్ని చూసేందుకు అయినా ఫ్యామిలీతో కలిసి వెళ్లి థియేటర్లలో చూడొచ్చు.
[ Tufan9 Telugu News ]
బింబిసార మూవీ రివ్యూ & రేటింగ్
– 3.80 /5
Read Also : Bimbisara Movie Review : బింబిసార మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ కమ్ బ్యాక్..!