...

Big Boss 6 Telugu : బిగ్ బాస్ 6 మామూలుగా ఉండదు.. కంటెస్టెంట్స్‌గా దీప్తి సునయన, శ్రీహాన్..?

Big Boss 6 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ మరో రెండు నెలల్లో స్టార్ట్ అవుతుందని అప్పుడే అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ గా ఉండబోతున్నదని వార్తలొస్తున్నాయి. ఇకపోతే ఈ ఓటీటీ సీజన్ సిక్స్‌లో క్రేజీ పర్సన్స్ కంటెస్టెంట్స్ గా ఉండబోతున్నారట.

కాంట్రవర్సీస్ కు కేరాఫ్ గా ఉన్న పర్సన్స్ ను ఈ ఓటీటీ సీజన్ సిక్స్‌కు కంటెస్టెంట్స్ గా తీసుకురావాలని షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు టాక్. సీజన్ ఫైవ్‌లో లేకపోయినప్పటికీ వార్తల్లో నిలిచిన దీప్తి సునయన, శ్రీహాన్‌ను సీజన్ సిక్స్ లోకి తీసుకురావడానికి నిర్వాహకులు రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి.

సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. వీకెండ్‌లో.. వచ్చి స్టేజిపై అదరగొట్టాడు. సిరి‌కి సపోర్ట్ చేస్తూ.. హౌస్‌లో జరిగే పరిస్థితులను గురించి తాను అర్థం చేసుకోగలనని అంటూ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే శ్రీహాన్ సీన్స్ ఆ వీక్ హైలైట్ అయ్యాయి కూడా. కాగా, సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్‌గా రాబోతున్న క్రమంలో ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఇప్పటికే శ్రీహాన్ ను నిర్వాహకులు కన్సల్ట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. శ్రీహాన్ కూడా తాను పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానని పేర్కొనట్లు సమాచారం.

ఇక గత సీజన్‌లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌ను ‘సచ్చినోడా’ అంటూ స్వీట్‌గా తిట్టిన దీప్తి సునయన .. షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పేసింది. సీజన్ టూలో ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన దీప్తి సునయన.. సీజన్ సిక్స్ లోనూ పార్టిసిపేట్ చేయబోతుందట. చూడాలి మరి.. ఈ వార్తలో నిజమెంతుందో..

Read Also : Balakrishna : మగాళ్లకు మంచి టిప్ ఇచ్చిన బాలకృష్ణ.. భార్య విషయంలో ఆయన అదే ఫాలో అవుతాడట..