Bigg Boss 6 : కెప్టెన్సీ కోసం దిగజారిపోయిన గలాటా గీతు.. ఛీకొడుతున్న ప్రేక్షకులు..?

Bigg Boss 6 : ప్రేక్షకులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎట్టకేలకు ఇటీవల ప్రారంభం అయింది. ఈ సీజన్లో చాలామంది బుల్లితెర సెలబ్రిటీలతోపాటు కొందరు యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వారు కూడా పాల్గొన్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన గలాటా గీత కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఎనిమిదవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన గీతు హౌస్ లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండే గొడవలు ప్రారంభించింది. ప్రతి విషయంలో తలదూరుస్తూ తన బిహేవియర్ తో ఇంటి సభ్యులతో గొడవలు పడుతూ ఉంది.

bigg-boss-6-galata-geetu-has-been-demoted-for-the-post-of-captaincy-the-audience-is-cheering
bigg-boss-6-galata-geetu-has-been-demoted-for-the-post-of-captaincy-the-audience-is-cheering

ఇలా ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో నిలుస్తోంది. ఇక ఇటీవల కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గీతు ప్రవర్తన చూసి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా ఛీ కొడుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గీతు నంబర్ ప్లేట్స్ ని తన టీషర్ట్ లోపల దాచుకుంది. ఈ క్రమంలో గీతు టీం లో ఉన్న ఆరోహి కూడా ఇలా చేయడం తప్పు అని ప్రశ్నిస్తే.. గేమ్ లో నేను గెలవడానికి ఎంతైనా దిగజారుతా దురుసుగా సమాధానం చెప్పింది. అంతే కాకుండా ఈ టాస్క్ లో వేరే వల్ల కీస్ ని కూడా గీతు పక్కన పడేసింది.

Bigg Boss 6 : టీషర్ట్‌లో నెంబర్ ప్లేట్ దాచి.. అదేం గేమ్ స్ట్రాటజీ.. 

ఇక గీతు టీషర్ట్ లో నెంబర్ ప్లేట్స్ ని దాచుకోవటం విషయం గురించి ఆరోహి ప్రశ్నించగా.. గేమ్ లో అది నా స్ట్రాటజీ.. గేమ్ ఎలా ఆడిన కూడా గెలవటం మాత్రమే నాకు ముఖ్యం అంటు సమాధానం చెప్పింది. గేమ్ లో పక్క వాళ్ళని ఓడించటనికి ఏమైనా చేస్తా అని చెప్పటంతో..నీ టీ షర్ట్ లోపల నెంబర్ ప్లేట్ దాచి పెట్టావు. వాటిని తీయటానికి అబ్బాయిలు నీ టీషర్ట్ లోపల చేయి పెడితే ఏం చేస్తావు? అని మెరీనా ప్రశ్నించగా.. పెడితే పెట్టని నాకేమీ అలా అనిపించదు అంటూ దిగజారిపోయి సమధానం చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ క్రమంలోనే ఇలాంటి చెత్త షోల వల్ల సమాజానికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అంటూ నేటిజన్ లు పెద్ద ఎత్తున బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.

Read Also : Bigg Boss 6 Nominations: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే.. సేఫ్ జోన్ లో బాలాదిత్య!