Bigg Boss 6 Nominations: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే.. సేఫ్ జోన్ లో బాలాదిత్య!

Bigg Boss 6 Nominations: ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభం అయింది.ఈ కార్యక్రమంలోకి ఈ సీజన్లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమం ప్రారంభమైన రెండు రోజులకే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కొట్లాటలు మొదలయ్యాయి. ఇక ఈ కార్యక్రమం ఆదివారం ప్రారంభం కామడంతో సోమవారమే నామినేషన్స్ ప్రక్రియ జరగాల్సి ఉంది అయితే బిగ్ బాస్ ఈసారి కంటెస్టెంట్లను క్లాస్ మాస్ ట్రాష్ విభాగాలుగా విభజించారు ఇక ఈ విభాగాల నుంచి గీతు, ఆదిరెడ్డి, నేహా తమ ప్రతిభను కనబరచడంతో ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి తప్పుకున్నారు.

ఇకపోతే బాలాదిత్య, అభినయ, ఇనయ సుల్తానా డైరెక్ట్ నామినేషన్స్ లోకి వచ్చారు.ఇకపోతే గత సీజన్లో మాదిరి కాకుండా ఈ సీజన్లో ఎవరైతే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటారో వారి పేర్లను పేపర్ పై రాసి ఆ పేపర్ తీసుకెళ్లి టాయిలెట్ సీట్లో వేయాలి.ఇలా ఎక్కువ ఎవరి పేర్లు అయితే టాయిలెట్ సీట్ లో పడతాయో వారు నామినేట్ అయినట్లని బిగ్ బాస్ సూచించారు. ఇక ఈ టాస్కులు భాగంగా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లిస్టులో ఉన్నారు. ఆరోహి, ఇనయ, అభినయ, రేవంత్, ఫైమా, శ్రీ సత్య, చలాకి చంటి ఈవారం నామినేషన్ లో ఉన్నారు.

Bigg Boss 6 Nominations: నామినేషన్‌లో బాలాదిత్య…

ఇక ట్రాష్ విభాగం నుంచి బాలాదిత్య కూడా నామినేషన్ లో ఉన్నారు అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ ట్రాష్ లో ఉన్నటువంటి బాలాదిత్య ఇనయా సుల్తానా అభినయశ్రీ ఈ ముగ్గురిలో ఒకరిని సేవ్ చేయొచ్చని చెప్పడంతో క్లాస్ లో ఉన్న కంటెస్టెంట్లు బాలాదిత్యను సేవ్ చేయడంతో బాలాదిత్య నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ఇక నామినేషన్ లో ఉన్నటువంటి ఏడుగురిలో ఫైమా, చలాకి, రేవంత్ కిఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఈ ముగ్గురు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు మిగిలిన నలుగురులో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.